Sunday, November 18, 2007

సుపుత్రుడు--1971














సంగీత::K.V.మహదేవన్
రచన::ఆత్రేయ
గానం::ఘంటసాల,P.సుశీల
తారాగణం::అక్కినేని, లక్ష్మి, జగ్గయ్య,గుమ్మడి,అంజలీదేవి,పద్మనాభం,పద్మిని.

పల్లవి::

చిలకమ్మా..ఆఆఆ..పిలిచింది
గోరొంకా..ఆఆఆ..పలికింది  
చిలకమ్మ పిలిచింది..చిగురాకు గొంతుతో
గోరొంక వాలింది..కొండంత ఆశతో

చిలకమ్మ పిలిచింది..చిగురాకు గొంతుతో 
గోరొంక వాలింది..కొండంత ఆశతో
చిలకమ్మా..ఆఆఆ..పిలిచింది
గోరొంకా..ఆఆఆ..పలికింది

చరణం::1

ఉరిమేటి మబ్బులే..చిరుజల్లు కురిసేది 
చెఱలాడు మనసులే..చెలిమితో కలిసేది
ఉరిమేటి మబ్బులే..చిరుజల్లు కురిసేది  
చెఱలాడు మనసులే..చెలిమితో కలిసేది
చినదాని బుగ్గలకు..సిగ్గెపుడు వచ్చేది 
చినదాని బుగ్గలకు..సిగ్గెపుడు వచ్చేది
అనుకోని వలపులూ..అప్పుడే తెలిసేది 
చిలకమ్మా..ఆఆఆ..పిలిచింది
గోరొంకా..ఆఆఆ..పలికింది

చరణం::2

ఎఱ్ఱ ఎఱ్ఱగా పూచింది..దానిమ్మ పువ్వు 
కుఱ్ఱతనమంతా ఒలికావు..కులుకుల్లోనువ్వు 
చలిగాలి వీచింది..ప్రాణాలు జివ్వని 
అది గిలిగింత పెట్టితే..అనుకొంటి నువ్వని        
చిలకమ్మా..ఆఆఆ..పిలిచింది
గోరొంకా..ఆఆఆ..పలికింది 

చరణం::3

ఆ కొండ యీ కోన..కలిశాయి మంచులో 
నీరెండ తోచింది..నీవున్న తావులో 
ఆ కొండ యీ కోన..కలిశాయి మంచులో 
నీరెండ తోచింది..నీవున్న తావులో
ఊగింది మనపడవ..వయ్యారి కొలనులో 
ఊగింది మనపడవ..వయ్యారి కొలనులో
సాగాలి మనబ్రతుకు..యీ తీపి వూపులో 

చిలకమ్మా..ఆఆఆ..పిలిచింది
గోరొంకా..ఆఆఆ..పలికింది
చిలకమ్మా పిలిచింది..చిగురాకు గొంతుతో 
గోరొంక వాలింది..కొండంత ఆశతో
చిలకమ్మా..ఆఆఆ..పిలిచింది
గోరొంకా..ఆఆఆ..పలికింది

No comments: