Saturday, September 11, 2010

మల్లమ్మ కథ--1973







సంగీతం::S.P.కోదండపాణి
రచన::వేటూరి
గానం::P. సుశీల
తారాగణం::కృష్ణ,శారద,రామకృష్ణ,విజయలలిత,ప్రభకర్ రెడ్డి ,బేబి శ్రీదేవి

పల్లవి::

కావరావా దేవా దేవా..దీనజనపోషా
శరణు నీవే అభయమీవే..పాహి పరమేశా శ్రీ శైల మల్లీశా                   
కావరావా దేవా దేవా..దీనజనపోషా
శరణు నీవే అభయమీవే..పాహి పరమేశా శ్రీ శైల మల్లీశా   

చరణం::1

నిన్ను నమ్మిన దీనురాలికి..ఇదా బహుమానం
వరదుడని పెను బిరుదుపొందిన..నీకె అవమానం
ఆర్తివినవా ఆదుకొనవా..ఎందుకీ మౌనం..మ్మ్
ఆర్తివినవా ఆదుకొనవా..ఎందుకీ మౌనం
ఆలకించగలేవా..నా విషాధ గానం
శంకరా అభయంకరా నటభక్త లోకవ శంకరా బాలేందు శేఖర భవహరా        
కావరావా దేవా దేవా..దీనజనపోషా
శరణు నీవే అభయమీవే..పాహి పరమేశా శ్రీ శైల మల్లీశా   

చరణం::2

కనులరాలే రక్తదారలు..మట్టిలో కలిసె
మదిని రగిలె అగ్నిజ్వాలలు..మింటికే ఎగసె 
విభుని కావగ నన్ను బ్రోవగ..వేగ రాలేవా
విభుని కావగ నన్ను బ్రోవగ..వేగ రాలేవా
అంధకారము మానవా..ఆత్మజ్యోతిని చూపవా
రత్నసాను శరాసనా..రజతాద్రిశృంగ నికేతనా 
కందర్ప..గర్వ వినాశనా 
భస్మాంగ రాగ విలేపనా భవమోచనా 
ఫణిరాజ భూషణ..వృషణ వాహన 
ప్రమధనాధ త్రిలోచనా 
ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ
ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ 

No comments: