సంగీతం::S.P.కోదండపాణి
రచన::దాశరథి
గానం::P.సుశీల
తారాగణం::కృష్ణ,శారద,రామకృష్ణ,విజయలలిత,ప్రభకర్ రెడ్డి ,బేబి శ్రీదేవి
పల్లవి::
భవహరణా శుభచరణా..నాగాభరణా గౌరీరమణా
భవహరణా శుభచరణా..నాగాభరణా గౌరీరమణా
దిక్కేలేనీ దీనులపాలిట..దిక్కై నిలిచిన దేవుడవయ్యా
భవహరణా శుభచరణా..నాగాభరణా గౌరీరమణా
చరణం::1
నీ భక్తులకు పెన్నిది నీవే..మా కన్నులలో ఉన్నది నీవే
నీ భక్తులకు పెన్నిది నీవే..మా కన్నులలో ఉన్నది నీవే
నిండుమనసుతో నీవారొసగే..నిండుమనసుతో నీవారొసగే
గరికపూలకే..మురిసేవయ్యా
కన్నీటితోనే పూజించగానే..పన్నీరుగానే భావింతువయ్యా
భవహరణా శుభచరణా..నాగాభరణా గౌరీరమణా
చరణం::2
నందివాహనం వుందంటారే..కందిపోయే నీ కాళ్లెందుకయా
నందివాహనం వుందంటారే..కందిపోయే నీ కాళ్లెందుకయా
మంచుకొండ నీ ఇల్లంటారే..మంచుకొండ నీ ఇల్లంటారే
వొళ్ళంతాయీ..ఈ వేడెందుకయా
అన్నపూర్ణ నీ అండనుండగా..అన్నపూర్ణ నీ అండనుండగా
ఆకలిబాధ..నీకెందుకయా
భవహరణా..శుభచరణా..నాగాభరణా..గౌరీరమణా
దిక్కేలేనీ..దీనులపాలిట..దిక్కై నిలిచిన దేవుడవయ్యా
భవహరణా శుభచరణా..నాగాభరణా గౌరీరమణా
No comments:
Post a Comment