సంగీతం::S.P.కోదండపాణి
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల,ఘంటసాల
తారాగణం::కృష్ణ,శారద,రామకృష్ణ,విజయలలిత,ప్రభకర్ రెడ్డి ,బేబి శ్రీదేవి
పల్లవి::
ఎంతటి సరసుడవో ప్రీయా..ఎంతటి చతురుడవో ప్రియా
ఎంతటి సరసుడవో ప్రీయా..ఎంతటి చతురుడవో ప్రియా
ఎంతటి సరసుడవో..
చరణం::1
నవరాగాల లహరులతో..నామనసేమో దోచేవూ
నవరాగాల లహరులతో..నామనసేమో దోచేవూ
అనురాగాల ఊయెలలో..ఆ..తారక లందించేవు
తారకలెందుకు..నీ నయనమ్ముల తళ తళలే వుంటే
వెన్నెలలెందుకు..నీ చిరునవ్వుల వేల దివ్వెలుంటే..ఏ
ఎంతటి సరసుడవో ప్రీయా..ఆ..ఎంతటి చతురుడవో ప్రియా
ఎంతటి సరసుడవో..
చరణం::2
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఇన్నాళ్ళుగనే దేవదాసిని..ఈనాడో నీ చరణదాసిని
ఇన్నాళ్ళుగనే దేవదాసిని..ఈనాడో నీ చరణదాసిని
ఇంతకు మించిన ఏ సిరులైనా..ఇంతకు మించిన ఏ సిరులైనా
కోరదులే..నీ హృదయవాసినీ
నీ పాద మంజీర నాదములు..నిలిచెను అభినవ వేదములై
నీ నిత్య రమణీయ గీతికలు..నిండెను శారద చంద్రికలై
ఎంతటి సరసుడవో ప్రియా..ఎంతటి చతురుడవో..ప్రియా
ఎంతటి సరసుడవో ప్రియా..
చరణం::3
ఆ ఆ ఆ ఆ ఆ హా ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కొలనులోన నిలిచిన కలువ..నెలరాయని నే వలచేనూ
కొలనులోన నిలిచిన కలువ..నెలరాయని నే వలచేనూ
ఆ భావనలో కలువ బ్రతుకులో..ఆరని హారతి వెలిగేనూ
పరిమళాలు సోపానమ్ములపై..పరుగిడు పున్నమి జాబిలి
అచ్చమైన నీ అనురాగానికి..అంకితమాయెను నా మదీ
అంకితమాయెను..నా మదీ
No comments:
Post a Comment