పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
సంగీతం::K.V.మహాదేవన్
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P. సుశీల
అమ్మా అమ్మా అని పిలిచావూ
ఆ కమ్మనైన పిలుపుతో కట్టేసావూ
ఏ తల్లి కన్నబాబువో
నా కాళ్ళకు బంధం ఐనావు
అమ్మా అమ్మా అని పిలిచావూ
ఆ కమ్మనైన పిలుపుతో కట్టేసావూ
ఏ తల్లి కన్నబాబువో
నా కాళ్ళకు బంధం ఐనావు
ఎవరికీ మనసివ్వని దాననూ
ఏ మమతకూ నోచుకోని బీడును
ఎవరికీ మనసివ్వని దాననూ
ఏ మమతకూ నోచుకోని బీడును
మోడులా ఈ బ్రతుకును మోసాను
మోడులా ఈ బ్రతుకును మోసాను
నీ ముద్దుమోము చూచి మరల మొలకెత్తాను
అమ్మా అమ్మా అని పిలిచావూ
ఆ కమ్మనైన పిలుపుతో కట్టేసావూ
ఏ తల్లి కన్నబాబువో
నా కాళ్ళకు బంధం ఐనావు
కన్నతల్లి ఎవ్వరో ఎరుగవు నీవూ
కడుపు తీపి తీరని తల్లిని నేనూ
కన్నతల్లి ఎవ్వరో ఎరుగవు నీవూ
కడుపు తీపి తీరని తల్లిని నేనూ
కాలమే ఇద్దరిని కలిపింది ఎందుకో
కాలమే ఇద్దరిని కలిపింది ఎందుకో
ఒకరి కొరత ఇంకొకరు తీర్చుకొనేటందుకు
అమ్మా అమ్మా అని పిలిచావూ
ఆ కమ్మనైన పిలుపుతో కట్టేసావూ
ఏతల్లికన్నబాబువో..నాకాళ్ళకు బంధం ఐనావు
అమ్మా అమ్మా అని పిలిచావూ..
No comments:
Post a Comment