Tuesday, September 08, 2009

గంగ-మంగ--1973






























సంగీతం::రమేష్ నాయుడు
రచన::దాశరథి
గానం::రామకృష్ణ,P. సుశీల
తారాగణం::శోభన్‌బాబు, కృష్ణ, వాణిశ్రీ,సూర్యకాంతం, రేలంగి, చంద్రమోహన్ .

పల్లవి::

హ్హా హా హా..అరెరెరెరె పిపిపిపిపి..
అలా అలా అలా అలా గాలిలో 
పైర గాలిలో 
సాగి పోదామా తెలిమబ్బు జంటలై 
వలపు పంటలై
పొదామా సాగి పోదామా 
పొదామా సాగి పోదామా 
అలా అలా అలా అలా నింగిలో 
నీలి నింగిలో 
ఎగిరిపోదామా అందాల హంసలై 
రాజ హంసలై 
పోదామా ఎగిరి పోదామా 
పోదామా ఎగిరి పోదామా

చరణం::1

వెనుదిరిగి చూసే పనిలేదు మనకు 
దూరాలు తీరాలు చేరాలి మనము 
వెనుదిరిగి చూసే పనిలేదు మనకు 
దూరాలు తీరాలు చేరాలి మనము 
జతచేరి దూకే సేలయేళ్లలాగా 
లేల్లలాగా మునుముందుకేగాలి మనము
జతచేరి దూకే సేలయేళ్లలాగా 
లేల్లలాగా మునుముందుకేగాలి మనము 
నీకు నేను తోడుగా 
నేను నీకు నీడగా 
ఈ బాట మన బ్రతుకు బాటగా 
పూల బాటగా హాయిగా సాగి పోదామా
అలా అలా అలా అలా గాలిలో 
పైర గాలిలో పోదామా ఎగిరి పోదామా      

చరణం::2

అనురాగ లతలే పెనవేసె మనను 
ఏనాడు విడిపోదు మన ప్రేమ బంధం 
అనురాగ లతలే పెనవేసె మనను 
ఏనాడు విడిపోదు మన ప్రేమ బంధం 
అందాలు చిందే నీ లేతమోము 
నీ కంటి పాపలో నిలవాలి నిరతం
అందాలు చిందే నీ లేతమోము 
నా కంటి పాపలో నిలవాలి నిరతం
చేయి చేయి చేరగా 
మేను హాయి కోరగా 
నీ మాట నా మనసు మాటగా 
వలపు బాటగా జంటగా సాగి పోదామా 
అలా అలా అలా అలా గాలిలో 
పైర గాలిలో పోదామా ఎగిరి పోదామా 
పోదామా ఎగిరి పోదామా

No comments: