సంగీతం::కోదండపాణి
రచన::దాశరథి
గానం::ఘంటసాల
తారాగణం::N.T.రామారావు,లక్ష్మి,కాంతారావు,రాజశ్రీ,అంజలీ దేవి,నాగయ్య
పల్లవి::
మంచిని మరచీ..వంచన నేర్చీ
మంచిని మరచీ..వంచన నేర్చీ
నరుడే ఈనాడూ..వానరుడైనాడూ
వానరుడైనాడూ
మంచిని మరచీ..వంచన నేర్చీ
నరుడే ఈనాడూ..వానరుడైనాడూ
వానరుడైనాడూ
చరణం::1
చదువు తెలివి పెంచాడూ..చంద్రలోకం జయించాడూ
చదువు తెలివి పెంచాడూ..చంద్రలోకం జయించాడూ
నీతులు చెప్పి గోతులు తవ్వి..పాతాళానికి జారాడూ
మెదడే పెరిగి హృదయం తరిగి..నరుడే ఈనాడూ
వానరుడైనాడూ..వానరుడైనాడూ
చరణం::2
ఓ హో..ఓహోహో..ఓఓ ఓహో..ఓహోహో..
అందరి చెమటా చిందించాడూ..సంపద ఎంతో పెంచాడూ
అందరి చెమటా చిందించాడూ..సంపద ఎంతో పెంచాడూ
పంపకమంటూ వచ్చేసరికి..అంతా తనదే అన్నాడూ
ధనమే హెచ్చి గుణమే చచ్చి..నరుడే ఈనాడూ
వానరుడైనాడూ..వానరుడైనాడూ
No comments:
Post a Comment