Tuesday, September 08, 2009

ఇంటిదొంగలు--1973
















సంగీతం::S.P. కోదండపాణి
రచన::కొసరాజు
గానం::ఘంటసాల
తారాగణం::కృష్ణంరాజు, జమున,సత్యనారాయణ, రావి కొండలరావు, అల్లు రామలింగయ్య

పల్లవి::

ఇంతలేసి కన్నులున్న..లేడిపిల్లా
నువ్వు దారి తెలియక వచ్చావా
ఆ ఆ ఆ..పడుచుపిల్లా

ఇంతలేసి కన్నులున్న..లేడిపిల్లా
నువ్వు దారి తెలియక వచ్చావా
ఆ ఆ ఆ..పడుచుపిల్లా

చరణం::1

టిప్పుటాపుగా డ్రస్సు వేసుకొని
టైటు పాంటుతో..నువ్వొస్తుంటే 
హ హ హ ఆ ఆ..
టిప్పుటాపుగా డ్రస్సు వేసుకొని
టైటు పాంటుతో..నువ్వొస్తుంటే
పొలంగట్టుపై..పొయ్యేవాళ్ళు 
బిత్తరపోయి..చూస్తూవుంటే
వారేవా..అమ్మాయో అబ్బాయో తెలియక
అయోమయంలో పడ్డాను..ఇప్పుడే తెలుసుకున్నాను        

ఇంతలేసి కన్నులున్న..లేడిపిల్లా
నువ్వు దారి తెలియక వచ్చావా
ఆ ఆ ఆ..పడుచుపిల్లా

చరణం::1

నాజూకుగ నువ్ నడుస్తూవుంటే..నవ్వు ఆగనంటున్నదీ
అహా అహా..నీ ఎర్రని పెదవులు కదులుతువుంటె
మనసు లాగుతు వున్నదీ..నా మనసు లాగుతు వున్నదీ
ఏమండీ అమ్మాయిగారూ..ఎగురుకుంటు పోతున్నారూ
నిలిచి కాస్త మాటాడమ్మా..నోటి ముత్యాలు రాలవమ్మా        

ఇంతలేసి కన్నులున్న..లేడిపిల్లా
నువ్వు దారి తెలియక వచ్చావా
ఆ ఆ ఆ..పడుచుపిల్లా

No comments: