సంగీతం::రమేష్ నాయుడు
రచన::దాశరథి
గానం::S.P.బాలు
తారాగణం::శోభన్‌బాబు, కృష్ణ, వాణిశ్రీ,సూర్యకాంతం, రేలంగి, చంద్రమోహన్
పల్లవి::
హుషారు కావాలంటే..బేజారు పోవాలంటే
మందొక్కటే మందురా..ఇది మించి ఏముందిరా
హుషారు కావాలంటే..బేజారు పోవాలంటే
మందొక్కటే..మందురా
చరణం::1
అన్ని చింతలూ మరపించేది..ఎన్నో వింతలు చూపించేది
అన్ని చింతలూ మరపించేది..ఎన్నో వింతలు చూపించేది
మదిలో దాగిన నిజాలనన్ని మనతోనే పలికించేదీ
అహ అహ ఆ..ఏది మందొక్కటే మందురా
చరణం::2
జీవితమెంతో చిన్నదిరా..ప్రతి నిమిషం విలువైనదిరా
జీవితమెంతో చిన్నదిరా..ప్రతి నిమిషం విలువైనదిరా
నిన్నా రేపని తన్నుకోకురా ఉన్నది నేడే మరువబోకుర
అహ అహ అహా..ఆ
హుషారు కావాలంటే..బేజారు పోవాలంటే
మందొక్కటే మందురా
చరణం::3
ఇల్లు వాకిలి లేనివాడికి..రహదారే ఒక రాజమహలురా
ఇల్లు వాకిలి లేనివాడికి..రహదారే ఒక రాజమహలురా
తోడూ నీడా లేని వాడికి..మ్మ్ చొ చొ..తోకాడించే నీవే తోడురా
హుషారు కావాలంటే..బేజారు పోవాలంటే
మందొక్కటే మందురా..ఇది మించి ఏముందిరా
హుషారు కావాలంటే..బేజారు పోవాలంటే
No comments:
Post a Comment