Monday, September 29, 2014

సర్దార్ పాపారాయుడు--1980



సంగీతం::చక్రవర్తి
రచన::దాసరినారాయణరావు
గానం::S.P.బాలు, P.సుశీల
Film Directed By::DasariNarayanaRao
తారాగణం::N.T.రామారావు,శ్రీదేవి,శారద,రావుగోపాల్రావు,మోహన్‌బాబు,కైకాల సత్యనారాయణ,గుమ్మడి,ప్రభాకర్‌రావు,పండరీబాయి,అల్లురామలింగయ్య.

పల్లవి::

వోయ్..వోయ్..వోయ్ వోయ్
హల్లో..టెంపర్..ఓ..విజయా సూపర్
హల్లో..టెంపర్..ఓ..విజయా సూపర్
పైలా పచ్చీస్..పైలాపచ్చీస్ బుల్లెట్ బండి
అర్రే..పదిహేడేళ్ళు నిండీ నిండని స్కూటరండీ
రాటుదేలి..రచ్చకెక్కి..ఢీ కొన్నాయండి
రాటుదేలి..రచ్చకెక్కి..ఢీ కొన్నాయండి 
హల్లో..టెంపర్..ఓ..విజయా సూపర్ 

చరణం::1

ఎండకు కందే..సుకుమారుల్లా..ఉన్నారు మీరు
ముందుకు వెనుక..తెలియక నాపై..దాడికి వచ్చారు
మాట మాట పెరిగితే..నే మోటుతనానికి దిగితే

అర్రె కర్రో కత్తో విసిరితే..మీ కాలో చెయ్యో విరిగితే
మీ పెళ్ళి కాస్త గోవిందా..గోవిందా
మీకు మొగుడే రాడు గోవిందా..భజగోవిందా.. గోవిందా
పెళ్ళి కాస్త గోవిందా..గోవిందా
మీకు మొగుడే రాడు గోవిందా..భజగోవిందా
అహ..హల్లో..టెంపర్..ఓ..విజయా సూపర్
హల్లో..టెంపర్..ఓ..విజయా సూపర్

చరణం::2 

ముద్దు ముచ్చట తీరుస్తా..ముట్టుకోనీ నిన్నూ
పగలే చుక్కలు పొడిపిస్తాలే..ముద్దు పెట్టుకోనీ నన్ను

కాదని విర్రవీగితే..కయ్యానికి కాలు దువ్వితే
టక్కు నిక్కు చూపితే..నాలో తిక్కరేగితే
నీ టాపు లేచిపోతుంది గోవిందా
నీ షేపు మారిపోతుంది భజగోవిందా గోవిందా..గోవిందా
టాపు లేచిపోతుంది గోవిందా
నీ షేపు మారిపోతుంది గోవిందా..భజగోవిందా

హల్లో..టెంపర్..ఓ..విజయా సూపర్ 
హల్లో..హల్లో..టెంపర్..ఓ..విజయా సూపర్ 
పైలా పచ్చీస్..పైలాపచ్చీస్ బులెట్ బండీ
అర్రే..పదిహేడేళ్ళు నిండీ నిండని స్కూటరండీ
రాటుదేలి..రచ్చకెక్కి..ఢీ కొన్నాయండి
రాటుదేలి..రచ్చకెక్కి..ఢీ కొన్నాయండి
హల్లో..టెంపర్..ఓ..విజయా సూపర్
హల్లో..టెంపర్..ఓ..విజయా సూపర్

Sunday, September 28, 2014

అన్నా-తమ్ముడు--1958



సంగీతం::అశ్వథామ 
రచన::ఆచార్య.B.V.S.
Film Directed By::C.S.Rao 
గానం::జిక్కి
తారాగణం::N.T.రామారావు,షవుకారు జానకి,రాజసులోచన,జగ్గయ్య,రేలంగి,ముక్కామల.

పల్లవి::

మృగింపవే హృదయవీణా..ఆ
పలికింపవే మధురప్రేమ..ఆఆఆ   
మృగింపవే హృదయవీణా..ఆ

చరణం::1

మృదుల మనోహర నాదముతో..ఓఓఓ
మృదుల మనోహర నాదముతో..ఓఓఓ
జీవితఫలమే..ప్రేమయనీ..ఈ
అది కామితములను..ఊఒ.నిందయనీ
మృగింపవే హృదయవీణా..ఆ

చరణం::2 

సతిపతులను విరజాజిపూవులో
ప్రేమతావివై..పరిమళింతుగా
  
సతిపతులను విరజాజిపూవులో
ప్రేమతావివై..పరిమళింతుగా
హృదయభారమును..తీర్చు దంపతుల
మనసులొకటిగా..మార్చునుప్రేమా..ఆ
మృగింపవే హృదయవీణా..ఆ

చరణం::3

ఎవరెవరో మది..ఎరుగకున్ననూ
ఎదలో కదులును..తీయనిబాధా..ఆ

ఎవరెవరో మది..ఎరుగకున్ననూ
ఎదలో కదులును..తీయనిబాధా
ప్రేమ ఎరుగదా..తనవారెవరో
ప్రేమను బోలిన పెన్నిధిగలదా
మృగింపవే హృదయవీణా..ఆ

చరణం::4

అనుబలమున పరిపాలనజేసెడి
మనుజరాక్షసుల..కథములుమాపి

అనుబలమున పరిపాలనజేసెడి
మనుజరాక్షసుల..కథములుమాపి
విశ్వమానవుల..కల్యాణానికి
నాందిగీతమై..అలరునుప్రేమా..ఆ


మృగింపవే హృదయవీణా..ఆ
పలికింపవే మధురప్రేమ..ఆఆఆ   
మృగింపవే హృదయవీణా..ఆ

Anna-Tammudu--1958  
Music::Aswathama
Lyrics::Chaarya.B.V.S.
Singer::Jikki
Film Directed By::C.S.Rao
Cast::N.T.Ramarao,Shavukaru Janaki,Rajasulochana,Jaggayya,Relangi,Mukkaamala.

:::::::::

mRgimpavE hRdayaveeNaa..aa
palikimpavE madhuraprEma..aaaaaaaa   
mRgimpavE hRdayaveeNaa..aa

::::1

mRdula manOhara naadamutO..OOO
mRdula manOhara naadamutO..OOO
jeevitaphalamE..prEmayanii..ii
adi kaamitamulanu..ooo.nindayanii
mRgimpavE hRdayaveeNaa..aa

::::2 

satipatulanu virajaajipoovulO
prEmataavivai..parimaLintugaa
  
satipatulanu virajaajipoovulO
prEmataavivai..parimaLintugaa
hRdayabhaaramunu..teerchu dampatula
manasulokaTigaa..maarchunuprEmaa..aa
mRgimpavE hRdayaveeNaa..aa

::::3

evarevarO madi..erugakunnanuu
edalO kadulunu..teeyanibaadhaa..aa

evarevarO madi..erugakunnanuu
edalO kadulunu..teeyanibaadhaa
prEma erugadaa..tanavaarevarO
prEmanu bOlina pennidhigaladaa
mRgimpavE hRdayaveeNaa..aa

::::4

anubalamuna paripaalanajEseDi
manujaraakshasula..kathamulumaapi

anubalamuna paripaalanajEseDi
manujaraakshasula..kathamulumaapi
viSwamaanavula..kalyaaNaaniki
naandigeetamai..alarunuprEmaa..aa


mRgimpavE hRdayaveeNaa..aa
palikimpavE madhuraprEma..aaaaaaaa   
mRgimpavE hRdayaveeNaa..aa

Friday, September 26, 2014

అమెరికా అబ్బాయి--1987


సంగీతం::సాలూరి రాజేశ్వరరావు
రచన::ఆరుద్ర
గానం::P.సుశీల
సినిమా దర్శకత్వం::సింగీతం శ్రీనివాస రావు
తారాగణం::రాజశేకర్,రాధిక,అశ్విని,చరణ్‌రాజ్,గుమ్మడి,కైకాల సత్యనారాయణ. 

పల్లవి::

ఆ ఆ అ అ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
పలుకవే రాగవీణ..తెలుగు హృదయాలలోనా
తేనె కెరటాల..పైన

పలుకవే రాగవీణ..తెలుగు హృదయాలలోనా
తేనె కెరటాల..పైన

పలుకు పలుకులో లలిత భావనలు 
పల్లవించి పులకించగా..ఆ

పలుకు పలుకులో లలిత భావనలు 
పల్లవించి పులకించగా..ఆ

పదము పదములో మధుర రాగిణులు 
పరవశించి తలలూపగా

ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆఆఆఆఆఆఆ
పలుకవే రాగవీణ..తెలుగు హృదయాలలోనా
తేనె కెరటాల..పైన

చరణం::1

సిరిసంపదలు పెరిగిన గాని
పరువేమనిషికి ప్రాణమనీ..ఆఆఆ

సిరిసంపదలు పెరిగిన గాని
పరువేమనిషికి ప్రాణమనీ.

ఎవరికివారే పయనిస్తున్నా 
చివరకు మిగిలేది స్నేహమని..ఆఆ

పలుకవే రాగవీణ..తెలుగు హృదయాలలోనా
తేనె కెరటాల..పైన

చరణం::2

మనసుకు మనసూ శృతిలేకుంటే 
కలిసిఉన్నా దూరాలే..ఏ

మనసుకు మనసూ శృతిలేకుంటే 
కలిసిఉన్నా దూరాలే

మమతలు తామే ముడిపడిఉంటే 
దూరాలైనా..చేరువలే..ఆఆఆ

పలుకవే రాగవీణ..తెలుగు హృదయాలలోనా
తేనె కెరటాల..పైన

amerikaa abbaayi--1987
sangeetam::saaloori raajESwararaavu
rachana::Arudra
gaanam::P.Suseela
Film Directed By Singeetam Sreenivasarao sinimaa 
Cast::Rajashekhar,Radhika,Asvini,CharanRaj,Gummadi,Kakala Satyanarayana.


:::::::::

aa aa a a aa aa aa aa aa aa aa aa aa aa aa
palukavE raagaveeNa..telugu hRdayaalalOnaa
tEne keraTaala..paina

palukavE raagaveeNa..telugu hRdayaalalOnaa
tEne keraTaala..paina

paluku palukulO lalita bhaavanalu 
pallavinchi pulakinchagaa..aa

paluku palukulO lalita bhaavanalu 
pallavinchi pulakinchagaa..aa

padamu padamulO madhura raagiNulu 
paravaSinchi talaloopagaa

AA AA AA AA AA AA AA AA AA AAAAAAAA
palukavE raagaveeNa..telugu hRdayaalalOnaa
tEne keraTaala..paina

::::1

sirisampadalu perigina gaani
paruvEmanishiki praaNamanii..aaaaaaaa

sirisampadalu perigina gaani
paruvEmanishiki praaNamanii.

evarikivaarE payanistunnaa 
chivaraku migilEdi snEhamani..aaaaa

palukavE raagaveeNa..telugu hRdayaalalOnaa
tEne keraTaala..paina

::::2

manasuku manasoo SRtilEkunTE 
kalisiunnaa dooraalE..E

manasuku manasoo SRtilEkunTE 
kalisiunnaa dooraalE

mamatalu taamE muDipaDiunTE 
dooraalainaa..chEruvalE..aaaaaaaaa

palukavE raagaveeNa..telugu hRdayaalalOnaa
tEne keraTaala..paina

Tuesday, September 23, 2014

శారద--1978


























సంగీతం::చక్రవర్తి 
రచన::D.C.నారాయణరెడ్డి   
గానం::P.సుశీల,B.వసంత,రమణ బృందం
తారాగణం::శోభన్‌బాబు,శారద,జయంతి,సత్యనారాయణ,అల్లు రామలింగయ్య

పల్లవి::

జయ మంగళ గౌరీ దేవీ..జయ శంకరి జననీ..ఈ
శ్రీ..జయ మంగళ గౌరీ..దేవీ
జయ మంగళ గౌరీ..దేవీ..జయ శంకరి జననీ..ఈ
శ్రీ..జయ మంగళ గౌరీ..దేవీ

చరణం::1

అరుంధతీ అనసూయలవలె..మము
అరుంధతీ అనసూయలవలె..మము
రక్షించుమమ్మా..శ్రీ కల్పవల్లీ..దేవీ..ఈ 
జయ మంగళ గౌరీ దేవీ..జయ శంకరి జననీ..ఈ
శ్రీ..జయ మంగళ గౌరీ..దేవీ

చరణం::2

పసుపు కుంకుమలతో..ఓ..ముత్తైదు తనముతో..ఓ
పసుపు కుంకుమలతో..ఓ..ముత్తైదు తనముతో
కలకాలమూ మము కరుణించు శంకరి..దేవీ
జయ మంగళ గౌరీ దేవీ..జయ శంకరి జననీ..ఈ
శ్రీ..జయ మంగళ గౌరీ..దేవీ..ఈ

Saturday, September 20, 2014

భలే తమ్ముడు--1969




సంగీతం::T.V.రాజు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::మొహమ్మద్ రఫీ,P.సుశీల 
తారాగణం::N.T.రామారావు, K.R.విజయ,రేలంగి,రాజనాల,రమాప్రభ,మిక్కిలినేని,ప్రభాకరరెడ్డి  

పల్లవి::

గుమ్మ గుమ్మ గుమ్మా..ఆ
గుమ్మెత్తించే ముద్దులగుమ్మ
గుమ్మ గుమ్మ గుమ్మా..ఆ
గుమ్మెత్తించే ముద్దులగుమ్మ
కై పెక్కిన కన్నులతోనే మత్తెక్కించీ
కవ్వించే బొమ్మ..ఈ ముద్దుల గుమ్మ
ఉసికొలిపే వొంపులతోనే..మరులెత్తించీ
ఊగించే రెమ్మ..ఈ ముద్దులగుమ్మ 

గుమ్మ గుమ్మ గుమ్మా..ఆ
గుమ్మెత్తించే ముద్దులగుమ్మ
గుమ్మ గుమ్మ గుమ్మా..ఆ
గుమ్మెత్తించే ముద్దులగుమ్మ

చరణం::1

విసుగెత్తిన..బ్రతుకులలోన 
ఏముంది..పస ఏముంది
విసుగెత్తిన..బ్రతుకులలోన 
ఏముంది..పస ఏముంది
సిసలైన సారం ఈ క్లబ్బులు కౌగిట దాగుంది
సిసలైన సారం ఈ క్లబ్బులు కౌగిట దాగుంది
సరదాగా సీతాకోక..చిలకల్లాగ
తిరగాలి రోజూ..తీరాలి మోజు
రేపన్నది లేనేలేదు..రానేరాదు
ఉందొకటే నేడు..నీ ముందుంది చూడు 

గుమ్మ గుమ్మ గుమ్మా..ఆ
గుమ్మెత్తించే ముద్దులగుమ్మ
గుమ్మ గుమ్మ గుమ్మా..ఆ
గుమ్మెత్తించే ముద్దులగుమ్మ

చరణం::2

గుమ్మా..ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కాకి కోకిల అవుతుందా..కంచు కనకం అవుతుందా
క్లబ్బు కాపురమవుతుందా..వెలయాలు ఇల్లాలు అవుతుందా
కాకి కోకిల అవుతుందా..కంచు కనకం అవుతుందా
క్లబ్బు కాపురమవుతుందా..వెలయాలు ఇల్లాలు అవుతుందా

జబ్బలదాకా జాకెట్టు..సిగ్గూ ఎగ్గూ తీసికట్టు
బారెడు జుట్టు..జానెడాయె
బొడ్డు క్రింద చీరకట్టు..మోజులాయె 
బారెడు జుట్టు..జానెడాయె
బొడ్డు క్రింద చీరకట్టు..మోజులాయె..హేయ్..య్యా
ఓరయ్యో ఉన్నది..అంతా ఉన్నట్టంటే
ఊరంతా ఉలుకు..గుండెల్లో కలుకు 
ఓరయ్యో ఉన్నది..అంతా ఉన్నట్టంటే
ఊరంతా ఉలుకు..గుండెల్లో కలుకు

గుమ్మ గుమ్మ గుమ్మా..ఆ
గుమ్మెత్తించే ముద్దులగుమ్మ
గుమ్మ గుమ్మ గుమ్మా..ఆ
గుమ్మెత్తించే ముద్దులగుమ్మ

గుమ్మ గుమ్మ గుమ్మా..ఆ
గుమ్మెత్తించే ముద్దులగుమ్మ
గుమ్మ గుమ్మ గుమ్మా..ఆ
గుమ్మెత్తించే ముద్దులగుమ్మ

గుమ్మ గుమ్మ గుమ్మా..ఆ
గుమ్మెత్తించే ముద్దులగుమ్మ
గుమ్మ..ఆ ఆ ఆ ఆ ఆ ఆ 

Friday, September 12, 2014

పొరుగింటి పుల్లకూర--1976


సంగీతం::చక్రవర్తి
రచన::అప్పలాచారి
గానం::రామకృష్ణ,L.R.అంజలి 
Film Directed By::V.Madhusoodhana Rao 
తారాగణం::రామకృష్ణ,కాంచన,మురళీమోహన్,జయచిత్ర,రాజబాబు,మమత,నిర్మల,కాకరాల

పల్లవి::

రాజును చూచిన కన్నులతో..మొగుడ్ని చూస్తే చులకనలే
పొరుగింటి పుల్లకూర..ఎంతో రుచిగా వుండునులే
రాజును చూచిన కన్నులతో..మొగుడ్ని చూస్తే చులకనలే
పొరుగింటి పుల్లకూర..ఎంతో రుచిగా వుండునులే
సరిసరి సరిసరి..తెలిసెను...తెలిసెను
అహహా..ఒహోహో..అహహా..ఒహోహో 
రాజును చూచిన కన్నులతో..మొగుడ్ని చూస్తే చులకనలే
పొరుగింటి పుల్లకూర..ఎంతో రుచిగా వుండునులే

చరణం::1

సైకిల్‌ సవారి బాగుందా..సరదా యిప్పుడు తీరిందా
సైకిల్‌ సవారి బాగుందా..సరదా యిప్పుడు తీరిందా
రెండు చేతులా సందునా..రెండు చేతులా సందునా
నలుగుతు...వుంటే బాగుందా
మరిమరి అడుగకు..తెలిసెను తెలిసెను 
అహహా..ఒహోహో..అహహా..ఒహోహో    
రాజును చూచిన కన్నులతో..మొగుడ్ని చూస్తే చులకనలే
పొరుగింటి పుల్లకూర..ఎంతో రుచిగా వుండునులే

చరణం::2

వామన గుంటలు ఆడేదా..ఒళ్ళో కబుర్లు చెప్పేదా
వామన గుంటలు ఆడేదా..ఒళ్ళో కబుర్లు చెప్పేదా
చక్కిలి గింతలు పెట్టేదా..చక్కిలి గింతలు పెట్టేదా
చెక్కిలి...ముద్దులు యిచ్చేదా
ఉహుహు ఉహుహు..అడగకు అడగకు  
అహహా..ఒహోహో..అహహా..ఒహోహో   
రాజును చూచిన కన్నులతో..మొగుడ్ని చూస్తే చులకనలే
పొరుగింటి పుల్లకూర..ఎంతో రుచిగా వుండునులే 

చరణం::3

అందని వస్తువు ఏదైనా..ఆశలు రేపును ఎదలోనా
అందని వస్తువు ఏదైనా..ఆశలు రేపును ఎదలోనా
విషయం వివరం తెలిసిందా..విషయం వివరం తెలిసిందా
వేడుక...యింకా మిగిలిందా
మరి మరి అడగకు..తెలిసెను తెలిసెను
అహహా..ఒహోహో..అహహా..ఒహోహో     
రాజును చూచిన కన్నులతో..మొగుడ్ని చూస్తే చులకనలే
పొరుగింటి పుల్లకూర..ఎంతో రుచిగా వుండునులే 
అహహా..ఒహోహో..అహహా..ఒహోహో 
అహహా..ఒహోహో..అహహా..ఒహోహో    
అహహా..ఒహోహో..అహహా..ఒహోహో 
అహహా..ఒహోహో..అహహా..ఒహోహో    

Poruginti Pullakura--1976
Music::Chakravarti
Lyrics::Appalaachaari
Singer's::Ramakrishna,l.R.Anjali
Film Directed By::V.Madhusudhana Rao
Cast::Ramakrishna,Muralimohan,Kaachana,Jayachitra,Rajababu,Mamata,Nirmala,Kaakaraala.

:::::::::

raajunu choochina kannulatO..moguDni choostE chulakanalE
poruginTi pullakoora..entO ruchigaa vunDunulE
raajunu choochina kannulatO..moguDni choostE chulakanalE
poruginTi pullakoora..entO ruchigaa vunDunulE
sarisari sarisari..telisenu...telisenu
ahahaa..ohOhO..ahahaa..ohOhO 
raajunu choochina kannulatO..moguDni choostE chulakanalE
poruginTi pullakoora..entO ruchigaa vunDunulE

::::1

saikil savaari baagundaa..saradaa yippuDu teerindaa
saikil savaari baagundaa..saradaa yippuDu teerindaa
renDu chEtulaa sandunaa..renDu chEtulaa sandunaa
nalugutu...vunTE baagundaa
marimari aDugaku..telisenu telisenu 
ahahaa..ohOhO..ahahaa..ohOhO    
raajunu choochina kannulatO..moguDni choostE chulakanalE
poruginTi pullakoora..entO ruchigaa vunDunulE

::::2

vaamana gunTalu aaDEdaa..oLLO kaburlu cheppEdaa
vaamana gunTalu aaDEdaa..oLLO kaburlu cheppEdaa
chakkili gintalu peTTEdaa..chakkili gintalu peTTEdaa
chekkili...muddulu yichchEdaa
uhuhu uhuhu..aDagaku aDagaku  
ahahaa..ohOhO..ahahaa..ohOhO   
raajunu choochina kannulatO..moguDni choostE chulakanalE
poruginTi pullakoora..entO ruchigaa vunDunulE

::::3

andani vastuvu Edainaa..aaSalu rEpunu edalOnaa
andani vastuvu Edainaa..aaSalu rEpunu edalOnaa
vishayam vivaram telisindaa..vishayam vivaram telisindaa
vEDuka...inkaa migilindaa
mari mari aDagaku..telisenu telisenu
ahahaa..ohOhO..ahahaa..ohOhO     
raajunu choochina kannulatO..moguDni choostE chulakanalE
poruginTi pullakoora..entO ruchigaa vunDunulE 
ahahaa..ohOhO..ahahaa..ohOhO 
ahahaa..ohOhO..ahahaa..ohOhO    
ahahaa..ohOhO..ahahaa..ohOhO 
ahahaa..ohOhO..ahahaa..ohOhO  

రహస్యం--1967::రాగేశ్రీ::రాగం



సంగీతం::ఘంటసాల గారు
రచన::మల్లాది రామకృష్ణశాస్త్రీ
గానం::ఘంటసాల,P.సుశీల
Film Director By::Vedantam Raghavaiah
తారాగణం::అక్కినేని నాగేశ్వరరావు,కృష్ణకుమారి,C.H..నారాయణరావు,S.V.రంగారావు,
B.సరోజాదేవి,గుమ్మడి,రమణారెడ్డి,G.వరలక్ష్మి,రాజశ్రీ,కాంతారావు,చిత్తూరునాగయ్య, 

రాగేశ్రీ::రాగం 
(హిందుస్తానీ రాగం)

పల్లవి::

మగరాయా వలరాయ ఈ వయ్యారి నీసొమ్మురారా
ఈ వయ్యారి నీసొమ్మురారా
మగరాయా వలరాయ ఈ వయ్యారి నీసొమ్మురారా 
ఈ వయ్యారి నీసొమ్మురారా

చరణం::1

ఆఆఅ..ఆ ఆ ఆ ఆ..ఆఆఆ..ఆ ఆ ఆ ఆ  
చిక్కని వెన్నెల..చిందే వేళా
అందని అందాలు..అందే వేళా
చిక్కని వెన్నెల..చిందే వేళా
అందని అందాలు..అందే వేళా 
మనసే మల్లెల..పానుపువేయ
ఆ..హ్హా..ఆ..హా..ఆఆఆఆఆ 
మనసే మల్లెల..పానుపువేయ
ఏల జాలమేలరా..ఆఆఆఆఆ 

మగరాయా వలరాయ ఈ వయ్యారి నీసొమ్మురారా 
ఈ వయ్యారి నీసొమ్మురారా

చరణం::2

మక్కువగా..బిగికౌగిలిలోనా
మైమరపించేనురా..నవమదనా
ఆఆఆ..హ్హా..ఆఆఆ..హా..ఆఆఆఆఆ
మక్కువగా..బిగికౌగిలిలోనా
మైమరపించేనురా..నవమదనా
సరసాలకు..నెరజాణవులేరా
సరసాలకు..నెరజాణవులేరా
రాజసాలు మానరా..ఆఆఆఆఆ

మగరాయా వలరాయ ఈ వయ్యారి నీసొమ్మురారా 
ఈ వయ్యారి నీసొమ్మురా..ఆ..రా

Rahasyam--1967::Ragesree::Raga
Music::Ghantasala Garu
Lyrics::Mallaadi RamakrishnaSastrii
Singer's::Ghantasala,P.Suseela
Film Director By::Vedantam Raghavaiah
Cast::Akkineni NageswaraoRao,Krishnakumari,C.H.NarayanaRao,S.V.Rangaravu,B.Saroja,Gummadi,Ramanareddy,G.Varalakshmii,Rajasree,KantaRao,ChitturuNagayya.

Ragesree::Raga
(Hindustanii::Raga) :::::::::

magaraayaa valaraaya ii vayyaari neesommuraaraa
ii vayyaari neesommuraaraa
magaraayaa valaraaya ii vayyaari neesommuraaraa 
ii vayyaari neesommuraaraa

::::1

aaaaaaa..aa aa aa aa..aaaaaaaaa..aa aa aa aa  
chikkani vennela..chindE vELaa
andani andaalu..andE vELaa
chikkani vennela..chindE vELaa
andani andaalu..andE vELaa 
manasE mallela..paanupuvEya
aa..hhaa..aa..haa..aaaaaaaaaaaaaa 
manasE mallela..paanupuvEya
Ela jaalamElaraa..aaaaaaaaaaaaaa 

magaraayaa valaraaya ii vayyaari neesommuraaraa 
ii vayyaari neesommuraaraa

::::2

makkuvagaa..bigikougililOnaa
maimarapinchEnuraa..navamadanaa
aaaaaaaa..hhaa..aaaaaaaa..haa..aaaaaaaaaaaaaa
makkuvagaa..bigikougililOnaa
maimarapinchEnuraa..navamadanaa
sarasaalaku..nerajaaNavulEraa
sarasaalaku..nerajaaNavulEraa
raajasaalu maanaraa..aaaaaaaaaaaaaaa

magaraayaa valaraaya ii vayyaari neesommuraaraa 
ii vayyaari neesommuraa..aa..raa

Thursday, September 11, 2014

కర్ణ--1964



సంగీతం::M.S.విశ్వనాథన్ రామ్మూర్తి 
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల బృందం 
తారాగణం::N.T.రామారావు, దేవిక, సావిత్రి, శివాజిగణేశన్, M.V.రాజమ్మ, సంధ్య, 
J. సీతారామన్, అశోకన్

పల్లవి::

ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ
ఆఆ హా హ ఆఆ హా హా ఆఆ ఆఆ 
ఆఆ హా హ హా హా హా ఆఆ ఆఆ 
బంగారుమోము కళమారే..పొంగారే వన్నెలు మారే
శృంగారాలే భామకు..వెగటాయెనే

బంగారుమోము కళమారే..పొంగారే వన్నెలు మారే
శృంగారాలే భామకు..వెగటాయెనే

చరణం::1

సాగి సాగి నడిచెను..ఆ నాడు ఈ చెలి 
ఆగి ఆగి నడిచేను ఈ నాడులే..ఏ 

సాగి సాగి నడిచెను..ఆ నాడు ఈ చెలి 
ఆగి ఆగి నడిచేను ఈ నాడులే

సిగ్గుపడి మాచెలి..చిగురించెలే
సిగ్గుపడి మాచెలి..చిగురించెలే
సిగ్గుపడి మా..ఆ..చెలి..చిగురించెలే

బంగారుమోము కళమారే..పొంగారే వన్నెలు మారే
శృంగారాలే భామకు..వెగటాయెనే

చరణం::2 

పడతి గళమున మాలలుంచి
పసుపు పూసి తిలకము దిద్ది
పాడండి..ఆడండీ..వసుధ పొంగగా
దానకర్ణుని సూరుడనగా..నీలమేఘం సాటియే 
దానకర్ణుని సూరుడనగా..నీలమేఘం సాటియే  
కలకాలముగ ఈ దేశమున..నవకరుణ కురిపించేనులే
కరుణ..కురిపించేనులే

పడతి గళమున మాలలుంచి
పసుపు పూసి తిలకము దిద్ది
పాడండి..ఆడండీ..వసుధ పొంగగా

Karna--1964
Music::M.S.ViSwanaathan RaamaMoorti 
Lyricsa::D.C.NaaraayanaReddi
Singer's::P.Suseela, Choras
Cast::N.T.Ramaravu,Devika,Savitri,SivaajiGanesh,M.V.Rajamma,Sandhya,J.Seetaraman,Ashokan.

::::::::::

AA AA AA AA AA AA AA AA
AA haa ha AA haa haa AA AA 
AA haa ha haa haa haa AA AA 
bangaarumOmu kaLamaarE..pongaarE vannelu maarE
SRngaaraalE bhaamaku..vegaTaayenE

bangaarumOmu kaLamaarE..pongaarE vannelu maarE
SRngaaraalE bhaamaku..vegaTaayenE

::::1

saagi saagi naDichenu..A naaDu I cheli 
Agi Agi naDichEnu ii naaDulE..E 

saagi saagi naDichenu..A naaDu I cheli 
Agi Agi naDichEnu ii naaDulE

siggupaDi maacheli..chigurinchelE
siggupaDi maacheli..chigurinchelE
siggupaDi maa..aa..cheli..chigurinchelE

bangaarumOmu kaLamaarE..pongaarE vannelu maarE
SRngaaraalE bhaamaku..vegaTaayenE

::::2 

paDati gaLamuna maalalunchi
pasupu poosi tilakamu diddi
paaDanDi..ADanDii..vasudha pongagaa
daanakarNuni sooruDanagaa..neelamEgham saaTiyE 
daanakarNuni sooruDanagaa..neelamEgham saaTiyE  
kalakaalamuga ii dESamuna..navakaruNa kuripinchEnulE
karuNa..kuripinchEnulE

paDati gaLamuna maalalunchi
pasupu poosi tilakamu diddi

paaDanDi..ADanDii..vasudha pongagaa

Monday, September 08, 2014

అన్నపూర్ణ--1960



సంగీతం::సుసర్ల దక్షిణామూర్తి
రచన::ఆరుద్ర
గానం::P.B.శ్రీనివాస్,P.సుశీల
31 December::జగ్గయ్య జయంతి
తారాగణం::జగ్గయ్య,జమున,గుమ్మడి,C.S.R.ఆంజనేయులు,రేలంగి,గిరిజ,ఛాయాదేవి.

పల్లవి::

మనసేమిటో..తెలిసిందిలే
కనుచూపులోనే
అనురాగమంతా..కనిపించెలే

మనసేమిటో..తెలిసిందిలే
చిననాటి..ఆశలు
ఈనాటికైనా..నెరవేరెలే

చరణం::1

ఓ..ఓ ఓహో..ఓ ఓ ఓ ఓ
ఓ..మురిపించకే మది పులకించునే
చెలి చిరునవ్వులో సుధ చిలికించవే
ఆ..కనుమూసినా..నేను కనుతెరచినా
నీవు కనిపింతువే హాయి కలిగింతువే

ఆ..చిననాటనే ప్రేమ చిగురించెనే
హోయ్..చిననాటనే ప్రేమ చిగురించెనే
ఓ..ఓ..ఓ ఓ ఓ..వికసించెనే
హో..చెలి నీకు బిడియాలు ఇపుడెందుకే
హో..చెలి నీకు బిడియాలు..ఇపుడెందుకే
మనసేమిటో..తెలిసిందిలే
చిననాటి..ఆశలు
ఈనాటికైనా..నెరవేరెలే

చరణం::2

ఓ..ఓ..ఓ..ఓహో..ఓ ఓ ఓ ఓ
హోయ్..నను చేరవే చెలి ఇటు చూడవే 
నేను నిను వీడనే వీడి మనజాలనే
ఆ..నెలకొంటివి నీవు మదిలోపల
నేడు తొలిప్రేమయే నీకు చెలికానుక
ఆ..కలలన్నియు..విరిసి ఫలియించునే
ఓ..కలలన్నియు..విరిసి ఫలియించునే
ఓ ఓ ఓ హో ఓ ఓ ఓ..నిజమౌనులే
ఓ..చెలి మనకు ఎడబాటు..ఇక లేదు లే 
హో..చెలి మనకు ఎడబాటు..ఇక లేదు లే 
మనసేమిటో..తెలిసిందిలే
చిననాటి..ఆశలు
ఈనాటికైనా..నెరవేరెలే

Annapoorna--1960
Music::Susarla Dakshinaamoorti
Lyrics::Arudra
Singer::P.B.Sreenivaas,P.Suseela
Cast::Jaggayya,Jamuna,GummaDi,C.S.R.Anjaneyulu,Relangi,Girija,Chaayaadevi.
31 December::jaggayya jayaMti

::::

manasemiTO..telisiNdile
kanuchoopulOne
anuraagamaNtaa..kanipiNchele

manasemiTO..telisiNdile
chinanaaTi..aaSalu
eenaaTikainaa..neraverele

:::1

O..O OhO..O O O O
O..muripinchake madi pulakinchune
cheli chirunavvulO sudha chilikinchave
aa..kanumoosinaa..nenu kanuterachinaa
neevu kanipintuve haayi kaligintuve

aa..chinanaaTane prema chigurinchene
hOy..chinanaaTane prema chigurinchene
O..O..O O O..vikasinchene
hO..cheli neeku biDiyaalu ipuDenduke
hO..cheli neeku biDiyaalu..ipuDenduke
manasemiTO..telisindile
chinanaaTi..aaSalu
eenaaTikainaa..neraverele

::::2

O..O..O..OhO..O O O O
hoY..nanu cherave cheli iTu chooDave
nenu ninu veeDane veeDi manajaalane
aa..nelakonTivi neevu madilOpala
neDu tolipremaye neeku chelikaanuka
aa..kalalanniyu..virisi phaliyinchune
O..kalalanniyu..virisi phaliyinchune
O O O hO O O O..nijamaunule
O..cheli manaku eDabaaTu..ika ledu le 
hO..cheli manaku eDabaaTu..ika ledu le 
manasemiTO..telisindile
chinanaaTi..aaSalu
eenaaTikainaa..neraverele

Saturday, September 06, 2014

కిలాడి బుల్లోడు--1972



సంగీతం::T.చలపతిరావు 
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు,P.సుశీల 
Film Directed By Ravi Raja Pinisetty 
తారాగణం::శోభన్‌బాబు,చంద్రకళ,సత్యనారాయణ,ముక్కామల,జ్యోతిలక్ష్మి,విజయభాను,రాజబాబు 

పల్లవి::

నిన్ను చూసి..ఈ లోకం చూస్తే..ఏఏ 
అన్నివైపులా..ఆ..అందాలే అందాలే
అందాలే..అందాలే..అందాలే..అందాలే
అందాలే...అందాలే

చరణం::1

గాలితరగలో..ఓఓఓ..కైపుందీ
పూలతీగలో..ఓఓఓ..ఊపుందీ
గాలితరగలో..కైపుందీ
పూలతీగలో..ఊపుందీ 
నిన్నా మొన్నా..లేని సోయగం..మ్మ్
కొమ్మ కొమ్మలో..ఓఓ..కురిసిందీ  
నిన్ను చూసి..ఈ లోకం చూస్తే..ఏఏ 
అన్నివైపులా..ఆ..అందాలే అందాలే
అందాలే...అందాలే

చరణం::2

పిల్లవాగులో..ఓఓఓ..విసురుందీ
కన్నె చూపులో..ఓఓఓ..కసివుందీ
పిల్లవాగులో...విసురుందీ
కన్నె చూపులో..కసివుందీ 
నిన్నా మొన్నా..లేని సోయగం..మ్మ్
కన్నులముందే..మెరిసిందీ  
నిన్ను చూసి..ఈ లోకం చూస్తే..ఏఏ 
అన్నివైపులా..ఆ..అందాలే అందాలే
అందాలే...అందాలే

చరణం::3

మనసు మనసులో..ఓఓఓ..కలిసిందీ
పెదవి పెదవినే..ఏఏఏ..పిలిచిందీ
మనసు మనసులో..కలిసిందీ
పెదవి పెదవినే...పిలిచిందీ
నిన్నా మొన్నా..లేనిసోయగం..మ్మ్
ఈ జగమంతా..వెలిగిందీ..ఈఈ  
నిన్ను చూసి..ఈ లోకం చూస్తే..ఏఏ  
అన్నివైపులా..ఆ..అందాలే అందాలే
అందాలే..అందాలే..అందాలే..అందాలే
అందాలే...అందాలే

Kilaadi Bullodu--1972
Music::T.ChalapatiRao
Lyrics::D.C.NarayanaReddi
Singer::S.P.Baalu,P.Suseela
Film Directed By Ravi Raja Pinisetty 
Cast::SobhanBabu,Chandrakala,Kaikala Satyanarayana,Mukkaamala,Jyotilakshmii,Vijayabhanu,RajaBabu.

:::::

ninnu choosi..ee lOkam choostE..EE  
annivaipulaa..aa..andaalE andaalE
andaalE..andaalE..andaalE..andaalE
andaalE...andaalE

::::1

gaalitaragalO..OOO..kaipundee
poolateegalO..OOO..oopundee
gaalitaragalO..kaipundee
poolateegalO..oopundee 
ninnaa monnaa..lEni sOyagam..mm
komma kommalO..OO..kurisindee 
ninnu choosi..ee lOkam choostE..EE 
annivaipulaa..aa..andaalE andaalE
andaalE...andaalE

::::2

pillavaagulO..OOO..visurundee
kanne choopulO..OOO..kasivundee
pillavaagulO...visurundee
kanne choopulO..kasivundee 
ninnaa monnaa..lEni sOyagam..mm
kannulamundE..merisindee 
ninnu choosi..ee lOkam choostE..EE 
annivaipulaa..aa..andaalE andaalE
andaalE...andaalE

::::3

manasu manasulO..OOO..kalisindee
pedavi pedavinE..EEE..pilichindee
manasu manasulO..kalisindee
pedavi pedavinE...pilichindee
ninnaa monnaa..lEnisOyagam..mm
ee jagamantaa..veligindee..II
  
ninnu choosi..ee lOkam choostE..EE  
annivaipulaa..aa..andaalE andaalE
andaalE..andaalE..andaalE..andaalE
andaalE...andaalE

భలే తమ్ముడు--1969



సంగీతం::T.V.రాజు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::మొహమ్మద్ రఫీ 
తారాగణం::N.T.రామారావు, K.R.విజయ,రేలంగి,రాజనాల,రమాప్రభ,మిక్కిలినేని,ప్రభాకరరెడ్డి  

పల్లవి::

ఎంతవారు గాని వేదాంతులైన గాని
వాలు చూపు సోకగానే తేలిపోదురోయ్
కైపులో కైపులో కైపులో..ఓ ఓ

ఎంతవారు గాని వేదాంతులైన గాని
వాలు చూపు సోకగానే తేలిపోదురోయ్
కైపులో కైపులో కైపులో..ఓ ఓ

చరణం::1

చిన్నది మేనిలో మెరుపున్నది హహ
చేపలా తళుకన్నది సైప లేకున్నది
చిన్నది మేనిలో మెరుపున్నది 
చేపలా తళుకన్నది సైప లేకున్నది
ఏ వన్నెకాని వలపు నమ్మి వలను చిక్కునో
కైపులో కైపులో కైపులో..ఓ ఓ

ఎంతవారు గాని వేదాంతులైన గాని
వాలు చూపు సోకగానే తేలిపోదురోయ్
కైపులో కైపులో కైపులో..ఓ ఓ

చరణం::2

ఆడకు వయసుతో చెరలాడకు ఆహా
ఆడితే వెనుకాడకు ఊహూ కూడి విడిపోకు
ఆడకు వయసుతో చెరలాడకు 
ఆడితే వెనుకాడకు కూడి విడిపోకు
మనసు తెలిసి కలిసి మెలిసి వలపు నింపుకో
కైపులో కైపులో కైపులో..ఓ ఓ

ఎంతవారు గాని వేదాంతులైన గాని
వాలు చూపు సోకగానే తేలిపోదురోయ్
కైపులో కైపులో కైపులో..ఓ ఓ 

చరణం::3

హహహ..ఓ..భలే భలే లేత వయసుడికిందిలే
తాత మనసూరిందిలే..లోకమింతేలే..ఏ
హహహ..ఓ..భలే భలే లేత వయసుడికిందిలే
తాత మనసూరిందిలే..లోకమింతేలే..ఏ
ఓయ్..పాత రుచులు తలచి తలచి తాత ఊగెనోయ్
కైపులో కైపులో కైపులో..ఓ ఓ

ఎంతవారు గాని వేదాంతులైన గాని
వాలు చూపు సోకగానే తేలిపోదురోయ్
కైపులో కైపులో కైపులో..ఓ ఓ

Bhale Tammudu--1969
Music::T.V.Raju
Lyrics::D.C.Narayanareddi
Singer's::Mohammed Rafi 
Cast::N.T.Ramarao,K.R.Vijaya,Relangi,Rajanala,Ramaaprabha,Mikkilineni,PrabhakarReddi.

:::::::

entavaaru gaani vedaantulaina gaani
vaalu choopu sOkagaane telipOdurOy
kaipulO kaipulO kaipulO..O O

entavaaru gaani vedaantulaina gaani
vaalu choopu sOkagaane telipOdurOy
kaipulO kaipulO kaipulO..O O

::::1

chinnadi menilO merupunnadi haha
chepalaa taLukannadi saipa lekunnadi
chinnadi menilO merupunnadi 
chepalaa taLukannadi saipa lekunnadi
ii vannekaani valapu nammi valanu chikkunO
kaipulO kaipulO kaipulO..O O

entavaaru gaani vedaantulaina gaani
vaalu choopu sOkagaane telipOdurOy
kaipulO kaipulO kaipulO..O O

::::2

aaDaku vayasutO cheralaaDaku aahaa
aaDite venukaaDaku oohoo kooDi viDipOku
aaDaku vayasutO cheralaaDaku 
aaDite venukaaDaku kooDi viDipOku
manasu telisi kalisi melisi valapu nimpukO
kaipulO kaipulO kaipulO..O O

entavaaru gaani vedaantulaina gaani
vaalu choopu sOkagaane telipOdurOy
kaipulO kaipulO kaipulO..O O

::::3

hahaha..O..bhale bhale leta vayasuDikindile
taata manasoorindile..lOkamintele..E
hahaha..O..bhale bhale leta vayasuDikindile
taata manasoorindile..lOkamintele..E
Oy..paata ruchulu talachi talachi taata oogenOy
kaipulO kaipulO kaipulO..O O

entavaaru gaani vedaantulaina gaani
vaalu choopu sOkagaane telipOdurOy
kaipulO kaipulO kaipulO..O O  

Friday, September 05, 2014

హైహై నాయకా--1989



సంగీతం::సురేశ్‌చంద్ర (మాధవపెద్ది సురేష్)
రచన::ముళ్ళపూడి శాస్త్రి
గానం::బాలు,మంజునాథ్
Cast:Naresh,Kota Srinivasa Rao, Suthi Velu, Brahmanandam, Mallikarjuna Rao

Sri Bharathi, Surya Kantham,SriLakshmi, Sandya

పల్లవి::

గురువంటే గుండ్రాయి కాదు
బుడుగంటే బుడిచెంబు కాదు
గురువంటే గుండ్రాయి కాదు
బుడుగంటే బుడిచెంబు కాదు
ఆడాలి గెలవాలి చదవాలి ఎదగాలి
ఆడాలి గెలవాలి చదవాలి ఎదగాలి
మనసులువిరబూసి మధువులు చిందాలి
గురువంటే గుండ్రాయి కాదు
బుడుగంటే బుడిచెంబు కాదు

చరణం::1

పురాణాలు వేదాలు రామాయణ భారతాలు
పురాణాలు వేదాలు రామాయణ భారతాలు
కథలెన్నీ వర్ణించినా హితమెంత బోధించినా
దోషిని దండించమని ద్రోహిని ఎదిరించమని
స్వార్థాన్ని పక్కకునెట్టి మానవతను పెంచమని
ఎలుగెత్తి చాటాయి 

పరోపకారం పుణ్యం పరహింసనమే పాపం
పరోపకారం పుణ్యం పరహింసనమే పాపం
గురువంటే గుండ్రాయి కాదు
బుడుగంటే బుడిచెంబు కాదు

చరణం::2

విభేదాలు వైరాలు కులమత విద్రోహాలు
విభేదాలు వైరాలు కులమత విద్రోహాలు
వివరించే నీతి ఒక్కటే 
సూచించే సూత్రమొక్కటే 
మంచికి విలువీయకుంటే
వంచన విడనాడకుంటే
మతసహనం మాటమరచి
సమతకు తను సమాధికడితే
నరుడే దానవుడవుతాడు
అసతోమా సద్గమయ
తమసోమా జ్యోతిర్గమయ
అసతోమా సద్గమయ
తమసోమా జ్యోతిర్గమయ
గురువంటే గుండ్రాయి కాదు
బుడుగంటే బుడిచెంబు కాదు

గురువంటే గుండ్రాయి కాదు
బుడుగంటే బుడిచెంబు కాదు
ఆడాలి గెలవాలి చదవాలి ఎదగాలి
ఆడాలి గెలవాలి చదవాలి ఎదగాలి
మనసులు విరబూసి మధువులు చిందాలి

గురువంటే గుండ్రాయి కాదు
బుడుగంటే బుడిచెంబు కాదు

గీత--1973


సంగీతం::చల్లపల్లిసత్యం
రచన::D.C..నారాయణరెడ్డి
గానం::S.జానకి
Film Directed By::G.K.Murthy










తారాగణం::ప్రసాద్ బాబు,లీలారాణి,రేలంగి,ముక్కామల,K.V.చలం,విజయభారతి

పల్లవి::

ఈనాడే తెలిసింది నా మనసే ఏమేమో తెలిపింది
ఈనాడే తెలిసింది నా మనసే ఏమేమో తెలిపింది 
అడుసులోని కమలానికి గుడిలోన చోటుందని
ఈనాడే తెలిసింది నా మనసే ఏమేమో తెలిపింది

చరణం::1

అందానికి హ్రుదయమే అసలైన అందమని
పరువానికి పరిణయమే విడిపోని బంధమని
పడిలేచే కెరటంలా సుడులు తిరుగు 
బ్రతుకున వలచిన చెలికాడే తిరుగులేని తీరమని
ఈనాడే తెలిసింది నా మనసే ఏమేమో తెలిపింది

చరణం::2

ముల్లపోదలలోన సిరిమల్లెలు విరిసేనని 
రాల్లైనా రాపిడితో రతనాలు అవునని
మన్నించే మనసుంటే కరుణించే కనులుంటే 
మన్నించే మనసుంటే కరుణించే కనులుంటే     
మలినమైన నీరైనా గంగాజలమవునని 
ఈనాడే తెలిసింది నా మనసే ఏమేమో తెలిపింది 
అడుసులోని కమలానికి గుడిలోన చోటుందని
ఈనాడే తెలిసింది నా మనసే ఏమేమో తెలిపింది 
నా మనసే ఏమేమో తెలిపింది నా మనసే ఏమేమో తెలిపింది

Geeta--1973
Music::Satyam
Lyrics::D.C.Narayanareddi
Singer::S.Janaki
Film Director::G.K.Murthy
Cast::PrasadBabu,Leelaaraani,Relangi,Mukkaamala,K.V.Chalam,VijayaBharati.

::::::::

iinaaDE telisindi naa manasE EmEmO telipindi
iinaaDE telisindi naa manasE EmEmO telipindi
adusulOni kamalaaniki guDilOna chOTundani 
iinaaDE telisindi naa manasE EmEmO telipindi

:::::1

andaaniki hRudayamE asalaina andamani
Paruvaaniki pariNayamE viDipOni bandhamani
PaDilEchE keraTamlaa suDulu tirugu 
bratukuna valachina chelikaaDE tirugulEni teeramani
iinaaDE telisindi naa manasE EmEmO telipindi

::::2

muLLapodalalOna sirimallelu virisEnani 
raaLLainaa raapiDitO ratanaalu avunani
manninchE manasunTE karuninchE kanulunTE 
manninchE manasunTE karuninchE kanulunTE 
malinamaina neerainaa gangaajalamavunani 
iinaaDE telisindi naa manasE EmEmO telipindi
aDusulOni kamalaaniki gudilOna choTundani 
iinaaDE telisindi naa manasE EmEmO 
telipindi naa manasE EmEmO telipindi
naa manasE EmEmO telipindi

Thursday, September 04, 2014

కర్ణ--1964



సంగీతం::M.S.విశ్వనాథన్ రామ్మూర్తి 
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల
తారాగణం::N.T.రామారావు, దేవిక, సావిత్రి, శివాజిగణేశన్, M.V.రాజమ్మ, సంధ్య, 
J. సీతారామన్, అశోకన్

పల్లవి::

ఎవ్వరి కొరకే..ఈ హృదిగీతి
ఇదియే నాకు..ప్రభువుల నీతీ..ఈ

ఎవ్వరి కొరకే..ఈ హృదిగీతి
ఇదియే నాకు..ప్రభువుల నీతీ..ఈ
ఎవ్వరి కొరకే..ఈ హృదిగీతి..ఈ

తనువున పూచే..మనసును రేపే
తలపే కనడాయే..తానే
ఎవ్వరి కొరకే..ఈ హృదిగీతి
ఇదియే నాకు..ప్రభువుల నీతీ..ఈ
ఎవ్వరి కొరకే..ఈ హృదిగీతి
ఇదియే నాకు..ప్రభువుల నీతీ..ఈ

చరణం::1

తనపనులేవో..తన కథలేవో
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
తనపనులేవో..తన కథలేవో
ంథిపురంలో..ఎంకొరకే
వసుధన విధిగా..కాచు ప్రభువే
ప్రణయిని వలపే..మరచెను తానే

ఎవ్వరి కొరకే..ఈ హృదిగీతి
ఇదియే నాకు..ప్రభువుల నీతీ..ఈ
ఎవ్వరి కొరకే..ఈ హృదిగీతి

చరణం::2

ఏనాడైననూ..నను కనరాడూ
ఏమే చెలియా..తోడౌతాడో
నన్ను చూడగా..రమ్మనవేలా
చల్లని ఊహలు..సాగే వేళా

ఎవ్వరి కొరకే..ఈ హృదిగీతి
ఇదియే నాకు..ప్రభువుల నీతీ..ఈ
ఎవ్వరి కొరకే..ఈ హృదిగీతి
ఇదియే నాకు..ప్రభువుల నీతీ..ఈ

Karna--1964
Music::M.S.ViSwanaathan RaamaMoorti 
Lyricsa::D.C.NaaraayanaReddi
Singer's::P.Suseela
Cast::N.T.Ramaravu,Devika,Savitri,SivaajiGanesh,M.V.Rajamma,Sandhya,J.Seetaraman,Ashokan.

:::::

evvari korakE..ii hRdigeeti
idiyE naaku..prabhuvula neetii..ii

evvari korakE..ii hRdigeeti
idiyE naaku..prabhuvula neetii..ii
evvari korakE..ii hRdigeeti..ii

tanuvuna poochE..manasunu rEpE
talapE kanaDaayE..taanE
evvari korakE..ii hRdigeeti
idiyE naaku..prabhuvula neetii..ii
evvari korakE..ii hRdigeeti
idiyE naaku..prabhuvula neetii..ii

::::1

tanapanulEvO..tana kathalEvO
aa aa aa aa aa aa aa aa aa aa
aa aa aa aa aa aa aa aa aa aa
aa aa aa aa aa aa aa aa aa aa
tanapanulEvO..tana kathalEvO
nthipuramlO..emkorakE
vasudhana vidhigaa..kaachu prabhuvE
praNayini valapE..marachenu taanE

evvari korakE..ii hRdigeeti
idiyE naaku..prabhuvula neetii..ii
evvari korakE..ii hRdigeeti

::::2

EnaaDainanuu..nanu kanaraaDuu
EmE cheliyaa..tODoutaaDO
nannu chUDagaa..rammanavElaa
challani Uhalu..saagE vELaa

evvari korakE..ii hRdigeeti
idiyE naaku..prabhuvula neetii..ii
evvari korakE..ii hRdigeeti
idiyE naaku..prabhuvula neetii..ii

Wednesday, September 03, 2014

అమర గీతం--1982




సంగీతం::ఇళయరాజా
రచన::వేటూరి 
గానం::S.P.బాలు 

పల్లవి::

నెలరాజా పరుగిడకు..చెలి వేచే నాకొరకు 
ఒక్కమారు పోయి..చెలిని గాంచుమా 
నివేదించుమా..విరహమే 

నెలరాజా పరుగిడకు..చెలి వేచే నాకొరకు 
ఒక్కమారు పోయి..చెలిని గాంచుమా 
నివేదించుమా..విరహమే
నెలరాజా పరుగిడకు..చెలి వేచే నాకొరకు 

చరణం::1 

మబ్బులలో తళుకుమనే మెరుపేలే చెలి అందం 
ముచ్చటగా ముత్యంలా మెరిసిపడే సఖి అందం 

వాడిపోనిదీ వనిత యవ్వనం 
ఆడిపాడితే కనుల నందనం 
అణువణువు విరిసేలే లావణ్యం 

నెలరాజా పరుగిడకు..చెలి వేచే నాకొరకు 
ఒక్కమారు పోయి..చెలిని గాంచుమా 
నివేదించుమా..విరహమే
నెలరాజా పరుగిడకు..చెలి వేచే నాకొరకు 

చరణం::2

ముంగిటనే రాచిలుకా పలికేనూ స్వాగతము 
మురిపెముగా తమ రాకా నా చెలితో తెలిపేనూ 
ముంగిటనే రాచిలుకా పలికేనూ స్వాగతము 
మురిపెముగా తమ రాకా నా చెలితో తెలిపేనూ 

కొండవాగులా..మల్లెతీగలా 
పులకరించినా..సన్నజాజిలా 
విరహిణిలా..వేచేను జవరాలే 

నెలరాజా పరుగిడకు..చెలి వేచే నా కొరకు
ఒక్కమారు పోయి..చెలిని గాంచుమా 
నివేదించుమా..విరహమే
నెలరాజా పరుగిడకు..చెలి వేచే నాకొరకు

ఆలాపన--1986


















Kalise Prati Sandhyalo by rampandu-bellary
సంగీతం::ఇళయరాజ
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు,S.జానకి

పల్లవి::

కలిసే ప్రతి సంధ్యలో కలిగే పులకింతలో
కలిసే ప్రతి సంధ్యలో కలిగే పులకింతలో
నాట్యాలన్నీ కరగాలి నీలో నేనే మిగలాలి
నాట్యాలన్నీ కరగాలి నీలో నేనే మిగలాలి

కలిసే ప్రతి సంధ్యలో..పలికే ప్రతి అందెలో

చరణం::1

పొంగిపోదా సాగరాత్మ నింగికి..ఆ ఆఆ  
చేరుకోదా చంద్ర హృదయం నీటికి..ఆఆఆ 
పొంగిపోదా సాగరాత్మ నింగికి..ఆ ఆఆ 
చేరుకోదా చంద్ర హృదయం నీటికి..ఆఆఆ  
సృష్టిలోన ఉంది ఈ బంధమే 
అల్లుతుంది అంతటా అందమే 
తొణికే బిడియం..తొలగాలి 
వణికే అధరం..పిలవాలి..ఆఆఆ 
ఆఆఆఆఆఆఆఆ..

కలిసే ప్రతి సంధ్యలో..పలికే ప్రతి అందెలో

చరణం::2

మేనితోనే ఆగుతాయి..ముద్రలు..ఆ ఆఆ  
గుండె దాకా సాగుతాయి..ముద్దులు..ఆ ఆ ఆ 
మేనితోనే ఆగుతాయి..ముద్రలు..ఆ ఆఆ  
గుండె దాకా సాగుతాయి..ముద్దులు..ఆ ఆ ఆ 
వింత తీపి కొంతగా..పంచుకో 
వెన్నెలంత కళ్ళలో..నింపుకో 
బ్రతుకే జతగా..పారాలి 
పరువం తీరం..చేరాలి..ఆఆఆ  
ఆఆఆఆఆఆఆఆఆఆఆఆ

కలిసే ప్రతి సంధ్యలో పలికే ప్రతి అందెలో 
కలిసే ప్రతి సంధ్యలో పలికే ప్రతి అందెలో
నాట్యాలెన్నో ఎదగాలి నాలో నేనే మిగలాలి
నాట్యాలెన్నో ఎదగాలి నాలో నేనే మిగలాలి
కలిసే ప్రతి సంధ్యలో పలికే ప్రతి అందెలో 

Monday, September 01, 2014

కర్ణ--1964



సంగీతం::M.S.విశ్వనాథన్ రామ్మూర్తి 
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల,కోరస్
తారాగణం::N.T.రామారావు, దేవిక, సావిత్రి, శివాజిగణేశన్, M.V.రాజమ్మ, సంధ్య, 
J. సీతారామన్, అశోకన్

పల్లవి::

కన్నులందే..ఏ..కనపడినాడే..ఏ
కన్నె మదిలో..ఓ..దాగున్నాడే..ఏ

కన్నులందే..ఏ..కనపడినాడే..ఏ
కన్నె మదిలో..ఓ..దాగున్నాడే..ఏ

చరణం::1

పదములు ఆడీ..పెదవులు పాడే
పదములు ఆడీ..ఈ..పెదవులు పాడీ..ఈ
కదిలె నాలో వెన్నెల రేడే..ఆ ఆ ఆ ఆ

కన్నులందే..కనపడినాడే
కన్నె మదిలో..దాగున్నాడే

చరణం::2

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

మృదువైన నా మేను కదలాడే విరహం
కదలాడే..విరహం..ఆ ఆ ఆ ఆ ఆ ఆ

మృదువైన నా మేను కదలాడే విరహం
కదలాడే..విరహం

మరుమల్లె చందాన..మాటాడే హృదయం
మరుమల్లె చందాన..మాటాడే హృదయం
ఎదలోన రగిలేను..తుదిలేని దాహం
చిగురించె మదిలోన..ఎనలేని మోహం
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 

కన్నులందే..కనపడినాడే
కన్నె మదిలో..దాగున్నాడే
కన్నులందే..ఏఏఏఏఏఏ

చరణం::3

ఆ ఆ ఆ ఆ ఆ ఆ..ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ..ఆ ఆ ఆ ఆ ఆ ఆ
గుణమేదో..కులమేదో..గురుతింపలేదే
గురుతింపలేదే..ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
ఆనాడే తొలిచూపు..లందించినాడే
గజరాజు వలెతానె..మునుసాగి నిలిచే
తనువున్న వలరాజు..నను చేర పిలిచే
ఆ ఆ ఆ ఆ ఆ ఆ..ఆ ఆ ఆ ఆ ఆ ఆ

కన్నులందే..కనపడినాడే
కన్నె మదిలో..దాగున్నాడే
కన్నులందే..ఏఏఏఏఏఏ

Karna--1964
Music::M.S.ViSwanaathan RaamaMoorti 
Lyricsa::D.C.NaaraayanaReddi
Singer's::P.Suseela, Choras
Cast::N.T.Ramaravu,Devika,Savitri,SivaajiGanesh,M.V.Rajamma,Sandhya,J.Seetaraman,Ashokan.

:::::

kannulandE..E..kanapaDinaaDE..E
kanne madilO..O..daagunnaaDE..E

kannulandE..E..kanapaDinaaDE..E
kanne madilO..O..daagunnaaDE..E

::::1

padamulu ADii..pedavulu paaDE
padamulu ADii..ii..pedavulu paaDii..ii
kadile naalO vennela rEDE..aa aa aa aa

kannulandE..kanapaDinaaDE
kanne madilO..daagunnaaDE

::::2

aa aa aa aa aa aa aa aa
aa aa aa aa aa aa aa aa

mRduvaina naa mEnu kadalaaDE viraham
kadalaaDE..viraham..aa aa aa aa aa aa

mRduvaina naa mEnu kadalaaDE viraham
kadalaaDE..viraham

marumalle chandaana..maaTaaDE hRdayam
marumalle chandaana..maaTaaDE hRdayam
edalOna ragilEnu..tudilEni daaham
chigurinche madilOna..enalEni mOham
aa aa aa aa aa aa aa aa aa aa aa aa 

kannulandE..kanapaDinaaDE
kanne madilO..daagunnaaDE
kannulandE..EEEEEE

::::3

aa aa aa aa aa aa..aa aa aa aa aa aa
aa aa aa aa aa aa..aa aa aa aa aa aa
guNamEdO..kulamEdO..gurutimpalEdE
gurutimpalEdE..aa aa aa aa aa aa 
AnaaDE tolichUpu..landinchinaaDE
gajaraaju valetaane..munusaagi nilichE
tanuvunna valaraaju..nanu chEra pilichE
aa aa aa aa aa aa..aa aa aa aa aa aa

kannulandE..kanapaDinaaDE
kanne madilO..daagunnaaDE
kannulandE..EEEEEE

భలే తమ్ముడు--1969



సంగీతం::T.V.రాజు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల 
తారాగణం::N.T.రామారావు,K.R.విజయ,రేలంగి,రాజనాల,రమాప్రభ,మిక్కిలినేని,ప్రభాకరరెడ్డి  

పల్లవి::

యే మజా..దేఖ్ లో  
జిందగీ..సీఖ్ లో
యే మజా..దేఖ్ లో  
జిందగీ..సీఖ్ లో
యే మజా దేఖ్ లో  
జిందగీ సీఖ్ లో

అందితే జుట్టు పట్టు 
అందకుంటే కాళ్ళుపట్టు
అదే జీవితం తెలుసుకో..ఓ
లైఫ్..లైఫ్..దట్స్ ది..లైఫ్
యే మజా దేఖ్ లో  
జిందగీ సీఖ్ లో

చరణం::1

గోళ్ళు గిల్లుతూ..కూర్చొని వుంటే
గొప్పవాడివి..కాలేవు
నీళ్ళు నములుతూ నిల్చొనివుంటే
చిల్లిగవ్వకూ..కొరగావు
గోళ్ళు గిల్లుతూ..కూర్చొని వుంటే
గొప్పవాడివి..కాలేవు
నీళ్ళు నములుతూ నిల్చొనివుంటే
చిల్లిగవ్వకూ..కొరగావు
వేషం..మ్మ్..మార్చుకో
అవకాశం..మ్మ్..చూసుకో
వేషం..మ్మ్..మార్చుకో..ఓ
అవకాశం..మ్మ్..చూసుకో..ఓ
సందుచూసి..మాటువేసి..కోటలోన పొగవేసి
అందలాలపైన సాగిపో..ఓ 
లైఫ్..లైఫ్..దట్స్ ది..లైఫ్
యే మజా దేఖ్ లో  
జిందగీ సీఖ్ లో

చరణం::2

నురుగులు చిందే మధువు పొంగులో
పరువపు విలువలు తెలుసుకో
పరుగులు తీసే మగువ మనసులో
విరహపు బరువులు పంచుకో

నురుగులు చిందే మధువు పొంగులో
పరువపు విలువలు తెలుసుకో
పరుగులు తీసే మగువ మనసులో
విరహపు బరువులు పంచుకో

మైకం..మ్మ్..వీడకు
ఈ లోకం..మ్మ్..చూడకు..హ్హా
మైకం..మ్మ్..వీడకు
ఈ లోకం..మ్మ్..చూడకు
అంతులేని సంబరాల అందలేని అంబరాలు
అంచులంది తేలి తేలిపో..ఓ

లైఫ్..లైఫ్..దట్స్ ది..లైఫ్
యే మజా దేఖ్ లో  
జిందగీ సీఖ్ లో
అందితే జుట్టు పట్టు 
అందకుంటే కాళ్ళుపట్టు
అదే జీవితం తెలుసుకో..ఓ