సంగీతం::సురేశ్‌చంద్ర (మాధవపెద్ది సురేష్)
రచన::ముళ్ళపూడి శాస్త్రి
గానం::బాలు,మంజునాథ్
Cast:Naresh,Kota Srinivasa Rao, Suthi Velu, Brahmanandam, Mallikarjuna Rao
Sri Bharathi, Surya Kantham,SriLakshmi, Sandya
పల్లవి::
గురువంటే గుండ్రాయి కాదు
బుడుగంటే బుడిచెంబు కాదు
గురువంటే గుండ్రాయి కాదు
బుడుగంటే బుడిచెంబు కాదు
ఆడాలి గెలవాలి చదవాలి ఎదగాలి
ఆడాలి గెలవాలి చదవాలి ఎదగాలి
మనసులువిరబూసి మధువులు చిందాలి
గురువంటే గుండ్రాయి కాదు
బుడుగంటే బుడిచెంబు కాదు
చరణం::1
పురాణాలు వేదాలు రామాయణ భారతాలు
పురాణాలు వేదాలు రామాయణ భారతాలు
కథలెన్నీ వర్ణించినా హితమెంత బోధించినా
దోషిని దండించమని ద్రోహిని ఎదిరించమని
స్వార్థాన్ని పక్కకునెట్టి మానవతను పెంచమని
ఎలుగెత్తి చాటాయి
పరోపకారం పుణ్యం పరహింసనమే పాపం
పరోపకారం పుణ్యం పరహింసనమే పాపం
గురువంటే గుండ్రాయి కాదు
బుడుగంటే బుడిచెంబు కాదు
చరణం::2
విభేదాలు వైరాలు కులమత విద్రోహాలు
విభేదాలు వైరాలు కులమత విద్రోహాలు
వివరించే నీతి ఒక్కటే
సూచించే సూత్రమొక్కటే
మంచికి విలువీయకుంటే
వంచన విడనాడకుంటే
మతసహనం మాటమరచి
సమతకు తను సమాధికడితే
నరుడే దానవుడవుతాడు
అసతోమా సద్గమయ
తమసోమా జ్యోతిర్గమయ
అసతోమా సద్గమయ
తమసోమా జ్యోతిర్గమయ
గురువంటే గుండ్రాయి కాదు
బుడుగంటే బుడిచెంబు కాదు
గురువంటే గుండ్రాయి కాదు
బుడుగంటే బుడిచెంబు కాదు
ఆడాలి గెలవాలి చదవాలి ఎదగాలి
ఆడాలి గెలవాలి చదవాలి ఎదగాలి
మనసులు విరబూసి మధువులు చిందాలి
గురువంటే గుండ్రాయి కాదు
బుడుగంటే బుడిచెంబు కాదు
No comments:
Post a Comment