Wednesday, September 03, 2014

అమర గీతం--1982




సంగీతం::ఇళయరాజా
రచన::వేటూరి 
గానం::S.P.బాలు 

పల్లవి::

నెలరాజా పరుగిడకు..చెలి వేచే నాకొరకు 
ఒక్కమారు పోయి..చెలిని గాంచుమా 
నివేదించుమా..విరహమే 

నెలరాజా పరుగిడకు..చెలి వేచే నాకొరకు 
ఒక్కమారు పోయి..చెలిని గాంచుమా 
నివేదించుమా..విరహమే
నెలరాజా పరుగిడకు..చెలి వేచే నాకొరకు 

చరణం::1 

మబ్బులలో తళుకుమనే మెరుపేలే చెలి అందం 
ముచ్చటగా ముత్యంలా మెరిసిపడే సఖి అందం 

వాడిపోనిదీ వనిత యవ్వనం 
ఆడిపాడితే కనుల నందనం 
అణువణువు విరిసేలే లావణ్యం 

నెలరాజా పరుగిడకు..చెలి వేచే నాకొరకు 
ఒక్కమారు పోయి..చెలిని గాంచుమా 
నివేదించుమా..విరహమే
నెలరాజా పరుగిడకు..చెలి వేచే నాకొరకు 

చరణం::2

ముంగిటనే రాచిలుకా పలికేనూ స్వాగతము 
మురిపెముగా తమ రాకా నా చెలితో తెలిపేనూ 
ముంగిటనే రాచిలుకా పలికేనూ స్వాగతము 
మురిపెముగా తమ రాకా నా చెలితో తెలిపేనూ 

కొండవాగులా..మల్లెతీగలా 
పులకరించినా..సన్నజాజిలా 
విరహిణిలా..వేచేను జవరాలే 

నెలరాజా పరుగిడకు..చెలి వేచే నా కొరకు
ఒక్కమారు పోయి..చెలిని గాంచుమా 
నివేదించుమా..విరహమే
నెలరాజా పరుగిడకు..చెలి వేచే నాకొరకు

No comments: