Kalise Prati Sandhyalo by rampandu-bellary
సంగీతం::ఇళయరాజ
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు,S.జానకి
పల్లవి::
కలిసే ప్రతి సంధ్యలో కలిగే పులకింతలో
కలిసే ప్రతి సంధ్యలో కలిగే పులకింతలో
నాట్యాలన్నీ కరగాలి నీలో నేనే మిగలాలి
నాట్యాలన్నీ కరగాలి నీలో నేనే మిగలాలి
కలిసే ప్రతి సంధ్యలో..పలికే ప్రతి అందెలో
చరణం::1
పొంగిపోదా సాగరాత్మ నింగికి..ఆ ఆఆ
చేరుకోదా చంద్ర హృదయం నీటికి..ఆఆఆ
పొంగిపోదా సాగరాత్మ నింగికి..ఆ ఆఆ
చేరుకోదా చంద్ర హృదయం నీటికి..ఆఆఆ
సృష్టిలోన ఉంది ఈ బంధమే
అల్లుతుంది అంతటా అందమే
తొణికే బిడియం..తొలగాలి
వణికే అధరం..పిలవాలి..ఆఆఆ
ఆఆఆఆఆఆఆఆ..
కలిసే ప్రతి సంధ్యలో..పలికే ప్రతి అందెలో
చరణం::2
మేనితోనే ఆగుతాయి..ముద్రలు..ఆ ఆఆ
గుండె దాకా సాగుతాయి..ముద్దులు..ఆ ఆ ఆ
మేనితోనే ఆగుతాయి..ముద్రలు..ఆ ఆఆ
గుండె దాకా సాగుతాయి..ముద్దులు..ఆ ఆ ఆ
వింత తీపి కొంతగా..పంచుకో
వెన్నెలంత కళ్ళలో..నింపుకో
బ్రతుకే జతగా..పారాలి
పరువం తీరం..చేరాలి..ఆఆఆ
ఆఆఆఆఆఆఆఆఆఆఆఆ
కలిసే ప్రతి సంధ్యలో పలికే ప్రతి అందెలో
కలిసే ప్రతి సంధ్యలో పలికే ప్రతి అందెలో
నాట్యాలెన్నో ఎదగాలి నాలో నేనే మిగలాలి
నాట్యాలెన్నో ఎదగాలి నాలో నేనే మిగలాలి
కలిసే ప్రతి సంధ్యలో పలికే ప్రతి అందెలో
No comments:
Post a Comment