సంగీతం::రాజన్ నాగేంద్ర
రచన::G.కృష్ణమూర్తి,
గానం::P. సుశీల, R.రాజశ్రీ
తారాగణం::కాంతారావు, రాజసులోచన, రాజనాల,గుమ్మడి,గిరిజ,రేలంగి, బేబి సావిత్రి
పల్లవి::
తీయ తీయని తేనెల మాటలతో
తీస్తారు సుమా గోతులు నమ్మవద్దూ
తెలియని చీకటి తొలగించీ
వెలుగిచ్చేది చదువే సూమా మానవద్దూ
చరణం::1
దొంగల చేతికి దొరకనిదీ
దానము చేసిన తరగనిదీ
దొంగల చేతికి దొరకనిదీ
దానము చేసిన తరగనిదీ
పదుగురిలోనా పరువును పెంచీ
పేరు తెచ్చే పెన్నిధదీ
పాఠాలన్నీ చదివేస్తాను
ఫస్టుగ నేను పాసౌతా
శభాష్..
తీయ తీయని తేనెల మాటలతో
తీస్తారు సుమా గోతులు నమ్మవద్దూ
చరణం::2
అల్లరి చేయుట చెల్లనిదీ
ఎల్లప్పు డాడుట కూడనిదీ
అల్లరి చేయుట చెల్లనిదీ
ఎల్లప్పు డాడుట కూడనిదీ
ఏడువరాదు ఏమరరాదు
వీరుని వలెనే నిలవాలీ
బెదరను నేను అదరను నేను
ఏ దెదురైనా ఎదిరిస్తా
శభాష్..
తీయ తీయని తేనెల మాటలతో
తీస్తారు సుమా గోతులు నమ్మవద్దూ
చరణం::3
బ్రతుకను బాటను కడదాకా
నడిచియె పోవలె ఒంటరిగా
బ్రతుకను బాటను కడదాకా
నడిచియె పోవలె ఒంటరిగా
యిడుములు రానీ పిడుగులు పడనీ
నీ అడుగులు తడబడునా
పిడుగులు పడినా జడవను నేను
వడి వడగానే అడుగేస్తా
శభాష్..
తీయ తీయని తేనెల మాటలతో
తీస్తారు సుమా గోతులు నమ్మవద్దూ
1 comment:
one of the most melodious songs...
thanks for the revival...
regards...
Post a Comment