సంగీతం::K.V.మహదేవన్
రచన::దాశరధి
గానం::ఘంటసాల
తారాగణం::అక్కినేని, విజయనిర్మల, శోభన్‌బాబు,నాగభూషణం,అల్లు రామలింగయ్య
మోహన::రాగం
సాకీ::
వేయి వేణువులు మ్రోగేవేళ
ఆ ఆ..ఆ ఆ..ఆ ఆ
హాయి వెల్లువై పొంగేవేళ
రాసకేళిలో తేలేవేళ
రాధమ్మను లాలించే వేళ
పల్లవి::
నను పాలింపగ నడచీ వచ్చితివా
మొరలాలింపగ తరలీ వచ్చితివా గోపాలా
నను పాలింపగ నడచీ వచ్చితివా
మొరలాలింపగ తరలీ వచ్చితివా గోపాలా
నను పాలింపగ నడచీ వచ్చితివా..ఆ
చరణం::1
అరచెదిరిన తిలకముతో అల్లదిగో రాధమ్మ
అరజారిన పయ్యెదతో అదిగదిగో గోపెమ్మ
ఎరుపెక్కిన కన్నులతో ఇదిగిదిగో సత్యభామ
పొద పొదలో ఎద ఎద లో
నీ కొరకై వెదుకుచుండగా
నను పాలింపగ నడచీ వచ్చితివా
మొరలాలింపగ తరలీ వచ్చితివా గోపాలా
నను పాలింపగ నడచీ వచ్చితివా..ఆ
చరణం::2
కంసుని చెరసాలలో ఖైదీవై పుట్టావు
కాంతల కౌగిళ్లలో ఖైదీవై పెరిగావు
కరకు రాతి గుళ్లలో ఖైదీగా నిలిచావు
ఈ భక్తుని గుండెలో ఖైదీగా ఉండాలని
నను పాలింపగ నడచీ వచ్చితివా
మొరలాలింపగ తరలీ వచ్చితివా గోపాలా
నను పాలింపగ నడచీ వచ్చితివా..ఆ
No comments:
Post a Comment