Wednesday, January 06, 2010

తిక్క శంకరయ్య--1968




సంగీతం::T.V.రాజు
రచన::C.నారాయణ రెడ్డి 
గానం::ఘంటసాల,P.సుశీల 

పల్లవి::

కోవెల ఎరుగని..దేవుడు కలడని
కోవెల ఎరుగని..దేవుడు కలడని
అనుకొంటినా నేను..ఏనాడు
కనుగొంటి కనుగొంటి..ఈనాడు

పలికే జాబిలి..ఇలపై కలదని
పలికే జాబిలి..ఇలపై కలదని
అనుకొంటినా నేను..ఏనాడు
కనుగొంటి కనుగొంటి..ఈనాడు
  
చరణం::1

ఇన్నాళ్ళుగా ఇన్నేళ్ళుగా..కన్నీట తపియించినాను
ఇన్నాళ్ళుగా ఇన్నేళ్ళుగా..కన్నీట తపియించినాను
నీ రాకతో..నీ మాటతో..నిలువెల్ల పులకించినాను
నిలువెల్ల..పులకించినాను..

కోవెల ఎరుగని..దేవుడు కలడని
అనుకొంటినా నేను..ఏనాడు 
కనుగొంటి కనుగొంటి..ఈనాడు
  
చరణం::2

ఇన్నాళ్ళుగా విరజాజిలా..ఈ కోనలో దాగినావు
ఇన్నాళ్ళుగా విరజాజిలా..ఈ కోనలో దాగినావు
ఈ వేళలో..నీవేలనో..నాలోన విరబూసినావు
నాలోన..విరబూసినావు
  
పలికే జాబిలి..ఇలపై కలదని
అనుకొంటినా నేను..ఏనాడు
కనుగొంటి కనుగొంటి..ఈనాడు
  
కోవెల ఎరుగని..దేవుడు కలడని
అనుకొంటినా నేను..ఏనాడు 
కనుగొంటి కనుగొంటి..ఈనాడు

ఆహా హా ఆ హాహహా..మ్మ్ మ్మ్ మ్మ్. 

No comments: