Wednesday, January 06, 2010

కాంచన గంగ--1984





సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::SP.బాలు,S.జానకి


ల ల ల ల ల ల లా.....
ఓ ప్రియతమా..నా గగనమా
ఇంద్రుడెవ్వరూ..చంద్రుడెవ్వరూ
సిరిగల మగసిరి గల నీ జంటలో

ఓ ప్రియతమా..నా భువనమా
నవ్వులుండగా..మల్లెలెందుకూ
సిరిగల సొగసరి నీ జంటలో

లేత రంగు నీలి మబ్బు చీర కట్టుకొస్తా
తారలన్ని కోసుకొచ్చి తోరణలు చేస్తా
చందమామ సాన మీద చందనాలు తీస్తా
ఎండ వెండి మువ్వలన్ని నీకు దండలేస్తా

పువ్వులోని రవ్వలన్ని దోచుకుంటే..వసంతమే వడ్డించేది ఎలా ?
నీ నోటి ముత్యాలు రాలవులే...

కొంగులేని క్రొత్త ఈడు కోక పట్టి చూడు
ముద్దులన్ని మూటబెట్టి ముందు ముచ్చటాడు
వానవిల్లు చీరలోని వన్నెలెమో ఏడు
చిన్నదాని చీరకున్న మూరలేమో మూడు

చెంపలోని కెంపులన్ని రాలకుండా..వయ్యారాలే వడ్డించే వేళా
ఆరారు కాలాలు చాలవులే..హే..హే...హే..
.

No comments: