Thursday, January 07, 2010

ఇంటి కోడలు--1974




సంగీతం::చక్రవర్తి
రచన::కోసరాజు 
గానం::జిక్కి, S.జానకి
Film Directed By::Lakshmii Deepak
తారాగణం::S.V.రంగారావు,కృష్ణంరాజు,గుమ్మడి,చంద్రమోహన్,మిక్కిలినేని,రావికొందలరావు,సాక్షిరంగారావు,మాడా,K.K.శర్మ,రమణారెడ్డి(అతిధి),ప్రమీల,S.వరలక్ష్మి,P.R.వరలక్ష్మీ,రోజారమణి,శ్రీరంజని,మాలతి,సూర్యకళ,సుశీల,సుధామాల,

పల్లవి::

చిన్నారి పొన్నారి..బుల్లెమ్మా 
వన్నెవాసీ కలిగి..వర్ధిల్లవమ్మా 
పరికిణీ కట్టే బాలప్రాయము దాటీ
పడుచు తనమూ..వచ్చేేనమ్మా
బుజ్జమ్మా...ఓ...బుజ్జమ్మా    
చిన్నారి పొన్నారి..బుల్లెమ్మా
వన్నెవాసీ కలిగి..వర్ధిల్లవమ్మా 

చరణం::1

చక్కిలిగింతల పులకించే దోరవయసూ
ఉక్కిరి బిక్కిరి చేసేనమ్మా 
చక్కని బంగారు పెళ్ళికొడుకూ 
చక్కని బంగారు పెళ్ళికొడుకూ 
సరసన సయ్యాట లాడాలమ్మా  
చిలకా గోరింకల్లా మెలగాలమ్మా
బుజ్జమ్మా..ఓ..బుజ్జమ్మా 
చిన్నారి పొన్నారి బుల్లెమ్మా
వన్నెవాసీ కలిగి వర్ధిల్లవమ్మా                

చరణం::2

బిడ్డా పాపా లేని సంసారం
అడవిని గాచిన వెన్నెల యౌనమ్మా
నిత్యము నీ యిల్లు కలకలాడగ 
నిత్యము నీ యిల్లు కలకలాడగ 
సంతానవతివౌచు మనవమ్మా
అలా అని బుజ్జమ్మా గంపెడు పిల్లలకంటావా 
ఏమొ గంపెడు పిల్లలకంటావా ఏమొ
వద్దమ్మా బుజ్జమ్మా వద్దమ్మా బుజ్జమ్మా వద్దమ్మా బుజ్జమ్మా 
ఒకరిద్దరైతేనే సుఖమమ్మా..హా హా హా 

No comments: