సంగీతం::సత్యం
రచన::మల్లెమాల
గానం::SP.బాలు,P.సుశీల
సన్నాజాజికి గున్నామావికి పెళ్ళికుదిరిందీ..
మాటే మంతీ లేని వేణువు పాట పాడిందీ..
సన్నాజాజికి గున్నామావికి పెళ్ళికుదిరిందీ..
మాటే మంతీ లేని వేణువు పాట పాడిందీ..
ఆ..హాహహా ఆ ఆ...హాహహా ఆ ఆ...
గున్నా మావికి సన్నా జాజికి పెళ్ళి కుదిరిందీ..
నాదే గెలుపని మాలతీ లత నాట్యమాడిందీ..
గున్నా మావికి సన్నా జాజికి పెళ్ళి కుదిరిందీ..
నాదే గెలుపని మాలతీ లత నాట్యమాడిందీ..
ఆ..హాహహా ఆ ఆ...ఓహో.హోహ్హో..
పూచే వసంతాలు మా కళ్ళలో..
పూలే తలంబ్రాలు మా పెళ్ళిలో..
పూచే వసంతాలు మా కళ్ళలో..
పూలే తలంబ్రాలు మా పెళ్ళిలో..
విరికొమ్మా..చిరు రెమ్మా..
విరికొమ్మ చిరు రెమ్మ
పేరంటానికి రారమ్మా
సన్నాజాజికి గున్నామావికి పెళ్ళికుదిరిందీ..
మాటే మంతీ లేని వేణువు పాట పాడిందీ..
ఆ..హాహహా ఆ ఆ...హాహహా ఆ ఆ..
కలలే నిజాలాయె ఈ నాటికీ..
అలలే స్వరాలాయె మా పాటకీ
కలలే నిజాలాయె ఈ నాటికీ..
అలలే స్వరాలాయె మా పాటకీ
శ్రీరస్తూ...శుభమస్తూ..
శ్రీరస్తు..శుభమస్తు
అని మీరూ మీరు దీవించాలి
గున్నా మావికి సన్నా జాజికి పెళ్ళి కుదిరిందీ..
నాదే గెలుపని మాధవీ లత నాట్యమాడిందీ...
సన్నాజాజి కి గున్నా మావికి పెళ్ళికుదిరిందీ..
హాహాహా..మ్మ్..
No comments:
Post a Comment