Wednesday, January 06, 2010

కాంచన గంగ--1984

ఈ పాట ఇక్కడ క్లిక్ చేసి వినండి

సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గాయకుడు::S.P.బాలు

పల్లవి::

వనిత...లత...కవిత..
మనలేవు లేక జత..

వనిత...లత...కవిత..
మనలేవు లేక జత..

ఇవ్వాలి చేయూత...
మనసివ్వడమే మమత..మనసివ్వడమే మమత..

వనిత...లత...కవిత
మనలేవు లేక జత..

చరణం::1

పూలు రాలి..నేలకూలి తీగబాల సాగలేదు..
చెట్టు లేక..అల్లుకోక..పువ్వు రాదు..నవ్వలేదు
మోడు మోడని తిట్టుకున్నా...తోడు విడిచేనా?
పులకరించే..కొత్త ఆశ, తొలగిపోయేనా

వనిత...లత...కవిత
మనలేవు లేక జత..

చరణం::2

ఆదరించే ప్రభుత లేక..కావ్య బాలా నిలువలేదు..
కవిత ఐనా.. వనిత ఐనా, ప్రేమ లేకా పెరగలేదు
చేదు చేదని తిట్టుకున్నా...చెలిమి విడిచేనా?
చేదు మింగి...తీపి నీకై, పంచ మరిచేనా

వనిత...లత...కవిత
మనలేవు లేక జత

తనది అన్నా..గూడు లేకా కన్నెబాలా బతుకలేదు..
నాది అన్న తోడు లేకా.. నిలువలేదు విలువలేదు!
పీడ పీడని తిట్టుకున్నా... నీడ విడిచేనా!
వెలుగులోన..నీడ లోన, నిన్నుమరిచేనా!!
వనిత... లత... కవిత
మనలేవు లేక జత!!

No comments: