సంగీతం::సత్యం
రచన::మల్లెమాల
గానం::P.సుశీల
శ్రీ:::రాగం
తెల్లావారకముందె పల్లె లేచిందీ..
తనవారినందరినీ తట్టిలేపిందీ
ఆదమరచి నిద్రపోతున్న తొలికోడి
అదిరిపడి మేల్కొంది అదే పనిగ కూసింది
తెల్లావారకముందె పల్లె లేచిందీ..
తనవారినందరినీ తట్టిలేపిందీ
వెలుగు దుస్తులేసుకొని సూరీడూ..
తూర్పు తలుపు తోసుకొని వచ్చాడు..
పాడుచీకటికెంత భయమేసిందో..
పక్కదులుపుకొని ఒకే పరుగు తీసిందీ..
అది చూసీ..లతలన్నీ..పక్కున నవ్వాయి
ఆ నవ్వులే ఇంటింటా పువ్వులైనాయీ..
తెల్లావారకముందె పల్లె లేచిందీ..
తనవారినందరినీ తట్టిలేపిందీ
పాలవెల్లిలాంటి మనుషులూ..
పండువెన్నెల వంటీ మనసులూ
మల్లెపూల రాసివంటి మమతలూ
పల్లెసీమలో కోకొల్లలూ..
అనురాగం..అభిమానం..కవలపిల్లలూ
ఆ పిల్లలకూ పల్లెటూళ్ళు కన్నతల్లులూ...
తెల్లావారకముందె పల్లె లేచిందీ..
తనవారినందరినీ తట్టిలేపిందీ
No comments:
Post a Comment