Wednesday, January 15, 2014

చిక్కడు - దొరకడు--1967


















సంగీతం::T.V.రాజు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::ఘంటసాల,P.సుశీల
తారాగణం::N.T.రామారావు, కాంతారావు,కృష్ణకుమారి, జయలలిత, సత్యనారాయణ 

సాకి::

విరిసిన ఇంద్రచాపమో..
భువిన్‌ప్రభవించిన..చంద్రబింభమో
మరు పూబంతివో..రతియో..
మల్లెల దొంతివో..మోహకాంతియో
సరస కవీంద్ర కల్పిత రసాకృతియో
నవరాగ గీతియో..ఓ..ఓఓఓఓఓ
వర సరసీరుహానన బిరాన వరించి
తరింప జేయవే..ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏ  

పల్లవి::

పగటి పూట చంద్రబింబం..అగుపించెను..ఏదీ ఏదీ
అందమైన నీ మోమే అదిగా కింకేది 
కానరాని మన్మధుడేమో..కనుపించెను..ఏడీ ఏడీ 
ఎదుటవున్న నీవేలే ఇంకా ఎవరోయీ

చరణం::1

వన్నె వన్నె తారలెన్నో కన్నుగీటి రమ్మన్నాయీ..
వన్నె వన్నె తారలెన్నో కన్నుగీటి రమ్మన్నాయీ..ఏవీ ఏవీ
అవి నీ సిగలోనే ఉన్నాయి..
పదును పదును బాణాలేవో..ఎదను నాటుకుంటున్నాయీ
పదును పదును బాణాలేవో..ఎదను నాటుకుంటున్నాయీ..ఏవీ ఎవీ
అవి నీ ఓరచూపులేనోయీ..

పగటి పూట చంద్రబింబం..అగుపించెను..ఏదీ ఏదీ
అందమైన నీ మోమే అదిగా కింకేది

చరణం::2

ఇంత చిన్న కనుపాపలలో..ఎలా నీవు దాగున్నావు
ఇంత చిన్న కనుపాపలలో..ఎలా నీవు దాగున్నావు

ఇంత లేత వయసున నీవు ఎంత హొయలు కురిపించేవు
ఇంత లేత వయసున నీవు ఎంత హొయలు కురిపించేవు
ఏమో ఏమో ఇరువురి మనసులు..ఒకటైతే ఇంతే ఇంతేనేమో

ఆహా హా ఆహా ఆహాహా..ఆహా హా ఆహా ఆహాహా
ఆహా హా ఆహా ఆహాహా..మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ 

No comments: