Wednesday, January 15, 2014

సి.ఐ.డి.(C I. D.)--1965



















సంగీతం::ఘంటసాల
రచన::పింగళి నాగేంద్రరావు
గానం::ఘంటసాల, P.సుశీల

పల్లవి::

నా మనసూ నీ మనసూ..ఒకటై మనమొకటిగా
ఎలా ఏకమౌదుమో..ఎలా కలిసిపోదుమో 
ఎలా ఏకమౌదుమో..ఎలా కలిసిపోదుమో

నా తనువూ నీ తనువూ..వేరు వేరు వేరైనా
పాలు నీరు కలియునటులె..కలసిమెలసి పోదము 
పాలు నీరు కలియునటులె..కలసిమెలసి పోదము 

చరణం::1

నీ హక్కులు నా హక్కులు వేరు వేరు వేరైనా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
నీ హక్కులు నా హక్కులు వేరు వేరు వేరైనా
కీచులాట లేకుండా మచ్చికతో ఉందమ 
కీచులాట లేకుండా మచ్చికతో ఉందమ

నా మనసూ నీ మనసూ..ఒకటై మనమొకటిగా
ఎలా ఏకమౌదుమో..ఎలా కలిసిపోదుమో

చరణం::2

నీ ప్రాణము నా ప్రాణము..ఒకటి ఒకటి ఒకటైనా 
నీ ప్రాణము నా ప్రాణము..ఒకటి ఒకటి ఒకటైనా 
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
నీవంటే నీవనుచూ..మ్మ్ ఆపావేం?
నీవంటే నీవనుచూ..కీచులాడుకొందమా

నా తనువూ నీ తనువూ..వేరు వేరు వేరైనా
పాలు నీరు కలియునటులె..కలసిమెలసి పోదము 
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ 

No comments: