సంగీతం::ఘంటసాల
రచన::పింగళి నాగేంద్రరావు
గానం::ఘంటసాల,పి.సుశీల
పల్లవి::
ఎందుకనో..నిను చూడగనే
కవ్వించాలని..ఉంటుంది
ఎందుకనో..నిను చూడగనే
కవ్వించాలని..ఉంటుంది
కవ్వించీ నీవు..కలహమాడితే
నవ్వుకొనాలని ఉంటుంది..ఎందుకనో
ఎందుకనో నిను చూడగనే
ఏదో ఇదిగా..ఉంటుంది
ఎందుకనో నిను చూడగనే
ఏదో ఇదిగా..ఉంటుంది
నీ పెదవులపై నవ్వు చిందితే
మనసు చల్లగా ఉంటుంది
ఎందుకనో..ఎందుకనో..
చరణం::1
అడుగడుగున నీ రాజసమంతా
ఒలికిస్తూ నువు కులుకుతుంటే
అడుగడుగున నీ రాజసమంతా
ఒలికిస్తూ నువు కులుకుతుంటే
కొంగున కట్టుకు నిను తిప్పాలని
నా కొంగున కట్టుకు నిను తిప్పాలని
ఏదో వేడుక పుడుతుంది..ఎందుకనో
ఎందుకనో నిను చూడగనే
ఏదో ఇదిగా..ఉంటుంది
కవ్వించే నీవు..కలహమాడితే
నవ్వుకొనాలని..ఉంటుంది..ఎందుకనో
చరణం::2
అణువణువున..నీ సొంపులు ఒంపులు
నను మైకంలో ముంచుతు ఉంటే
అణువణువున..నీ సొంపులు ఒంపులు
నను మైకంలో ముంచుతు ఉంటే
నీలో ఐక్యం చెందాలంటూ
నీలో ఐక్యం చెందాలంటూ
ఏదో తహతహ పుడుతుంది..ఎందుకనో
ఎందుకనో..నిను చూడగనే
కవ్వించాలని..ఉంటుంది
కవ్వించీ నీవు..కలహమాడితే
నవ్వుకొనాలని ఉంటుంది..ఎందుకనో
ఆ..ఆ..ఆ..ఓ..ఓ..ఓ..
ఆహా హో హో ఓ హో
ఓహో ఓహోహో
No comments:
Post a Comment