Thursday, January 16, 2014

ఉమా చండి గౌరి శంకరుల కథ--1968























సంగీతం::పెండ్యాల
రచన::పింగళి
గానం::ఘంటసాల, P.సుశీల

పల్లవి::

ఏమిటో ఈ మాయా..కలలోని కథవలెనాయే..ఏ..
ఏమిటో ఈ మాయా..కలలోని కథవలెనాయే..ఏ..
ఏమిటో ఈ మాయా..

వాణినరసి వానినొరసి..మనసు విరిసేనే
తానుగా నను తాకెనే..అది నిజమే కారాదా

ఏమిటో ఈ మాయా..కలలోని కథవలెనాయే
ఏమిటో ఈ మాయా..

చరణం::1

నాటిదో ఏనాటిదో నేటి..ఈ చెలిమి..ఈ..ఈ
నాటిదో ఏనాటిదో నేటి..ఈ చెలిమి..ఈ..ఈ
మేలుగా ఒక లీలగా కల నిజమే కారాదా

ఏమిటో ఈ మాయా..కలలోని కథవలెనాయే..ఏ..
ఏమిటో ఈ మాయా..

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 

కనులు కలిసి మనసు తెలిసి మేనులే సొలసీ
కనులు కలిసి మనసు తెలిసి మేనులే సొలసీ
ఉంటిమని కలగంటి కదా..అది నిజమే కారాదా

ఏమిటో ఈ మాయా..కలలోని కథవలెనాయే
ఏమిటో ఈ మాయా..

చరణం::2

ఎన్ని జన్మల పరిచయముతో..నన్ను పిలిచేనో సఖీ
ఎన్ని జన్మల పరిచయముతో..నన్ను పిలిచేనో
మేలుగా ఒక లీలగా కల నిజమే కారాదా

ఏమిటో ఈ మాయా..కలలోని కథవలెనాయే
ఏమిటో ఈ మాయా..


వరుని కొరకై జీవితమంతా విరహ బాధయేనా
వరుని కొరకై జీవితమంతా విరహ బాధయేనా
మాయయే మటుమాయమై కల నిజమే కారాదా

ఏమిటో ఈ మాయా..కలలోని కథవలెనాయే
ఏమిటో ఈ మాయా..

No comments: