సంగీతం::వేదా
రచన::దాశరధి
గానం::ఘంటసాల.P సుశీల
తారాగణం::కృష్ణ, కాంచన, రాజనాల, పద్మనాభం, గీతాంజలి, రమణారెడ్డి..
పల్లవి::
ముద్దులొలుకు చిన్నది మురిసిపోవుచున్నది
తలపులేవో కన్నులతోటి తెలుపగోరుచున్నది
ముద్దులొలుకు చిన్నది..అహ..అహ..అహ..
చిలిపి చిన్నికృష్ణుడు చెలియ చెంగు విడవడు
దాకుకున్న సొగసులన్నీ దోచుకొనక మానడు
చిలిపి చిన్నికృష్ణుడు...అహ..అహ...అహ..
చరణం::1
నీ గాజుల మీద ఒక తీయని ముద్దు
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
సిగ్గ పూవ్వుల మీద ఒక కమ్మని ముద్దు
ఎదపై గల నీ పైటకువెచ్చని ముద్దు
నిను మలచిన దేవునికే బంగరు ముద్దు
ముద్దులొలుకు చిన్నది మురిసిపోవుచున్నది
తలపులేవో కన్నులతోటి తెలుపగోరుచున్నది
ముద్దులొలుకు చిన్నది..అహ..అహ..అహ..ఆ
చరణం::2
నీ కన్నుల మీద ఆ వెన్నెల ముద్దు
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
చెలి చెక్కిలి మీద ఒక చక్కని ముద్దు
విరిపానుపు మీద విరబూసే ముద్దు
కలకాలము నా మదిలో వెలిగే ముద్దు
చిలిపి చిన్నికృష్ణుడు చెలియ చెంగు విడవడు
దాకుకున్న సొగసులన్నీ దోచుకొనక మానడు
ముద్దులొలుకు చిన్నది మురిసిపోవుచున్నది
తలపులేవో కన్నులతోటి తెలుపగోరుచున్నది
లలలలల..లా..లలలలల..లా..
లలలలల..లా..లలలలల..లా..
No comments:
Post a Comment