సంగీతం::ఘంటసాల
రచన::పింగళి
గానం::ఘంటసాల
మోహన::రాగం
పల్లవి::
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఐనదేమో ఐనది ప్రియ..గానమేదే ప్రేయసీ
ఐనదేమో ఐనది ప్రియ..గానమేదే ప్రేయసీ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ప్రేమగానము సోకగానే..భూమి స్వర్గమె ఐనదీ
భూమి స్వర్గమె ఐనది..
ఐనదేమో ఐనది ప్రియ...
చరణం::1
ఏమి మంత్రము వేసినావో
ఏమి మత్తును చల్లినావో
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
ఏమి మంత్రము వేసినావో
ఏమి మత్తును చల్లినావో
నిన్ను చూసిన నిముషమందే
మనసు నీవశమైనదీ..మనసు నీవశమైనది..
ఐనదేమో ఐనది ప్రియ..గానమేదే ప్రేయసీ
ఐనదేమో ఐనది ప్రియ..
చరణం::2
కులుకులొలికే హొయలు చూచి
వలపు చిలికే లయలు చూచి
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
కులుకులొలికే హొయలు చూచి
వలపు చిలికే లయలు చూచి
తలపులేవో రేగి నాలో
చాల కలవర మైనదీ..చాల కలవరమైనది
ఐనదేమో ఐనది ప్రియ..గానమేదే ప్రేయసీ
ఐనదేమో ఐనది ప్రియ..ఆ ఆ ఆ ఆ..
No comments:
Post a Comment