సంగీతం::పెండ్యలనాగేశ్వరరావ్
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు
తారాగణం::N.T.రామారావు,జమున,అంజలీదేవి,రాజబాబు,ప్రభాకర రెడ్డి
పల్లవి::
మెరిసే మేఘమాలికా..ఉరుములు చాలు చాలిక
చెలితో మాటలాడనీ..వలపే పాట పాడనీ
వలపే పాట...పాడనీ..ఈఈఈఈ
మెరిసే మేఘమాలికా..ఉరుములు చాలు చాలిక
చరణం::1
కమలాలే నా రమణి..నయనాలై విరిసే
అద్దాలే నా చెలియ..చెక్కిళ్ళై మెరిసే
ఆ నయనాల..కమలాల లోనా..ఆ
నా జిలుగు కలలు..చూసుకోనీ
ఆ అద్దాల చెక్కిళ్ళలోన..నా ముద్దులే దాచుకోనీ..ఈఈఈఈ
మెరిసే మేఘమాలికా..ఉరుములు చాలు చాలిక
చరణం::2
మధుమాసం చెలి మోవిని..దరహాసం చేసే
తెలిజాబిలి చెలి మోమున...కళలారబోసే
ఆ దరహాస కిరణాలలోన..నను కలకాలం కరిగిపోనీ
ఆ కళలపండు వెన్నెలలోన..నా వలపులన్ని వెలిగిపోనీ..ఈఈఈఈ
మెరిసే మేఘమాలికా..ఆ
No comments:
Post a Comment