Friday, May 10, 2013

బంగారు కుటుంబం--1971


సంగీతం::సత్యం
రచన::వీటూరి
గానం::ఘంటసాల 
తారాగణం::కృష్ణ,విజయనిర్మల,రాజశ్రీ,రామకృష్ణ,గుమ్మడి,అంజలీదేవి 

పల్లవి::

జీవితాన వరమే బంగారు కుటుంబం
జీవితాన వరమే బంగారు కుటుంబం
మరువరాని మధురమైన అనురాగం కదంబం              
జీవితాన వరమే బంగారు కుటుంబం

చరణం::1

కలసి మెలసి మనసు తెలిసి భార్య మసలగా 
కలసి మెలసి మనసు తెలిసి భార్య మసలగా
పాలకడలి వోలె భాగ్యాలు పొంగగా
పాలకడలి వోలె భాగ్యాలు పొంగగా
నమ్ముకున్నవారే ఆనంద మందగా
నమ్ముకున్నవారే ఆనంద మందగా
పసిపాపల చిరునవ్వులే..పరిమళాలు చిందగా             
జీవితాన వరమే బంగారు కుటుంబం
మరువరాని మధురమైన అనురాగం కదంబం              
జీవితాన వరమే బంగారు కుటుంబం

చరణం::2

ఆలూ మగలే అనురాగ జీవులైనా
వెరపేలేదు సంసార సాగరానా
కలిమి లేములలో కలతలెన్ని కలిగినా
కలిమి లేములలో కలతలెన్ని కలిగినా
చెదిరిపోని కాపురమే భగవానుని దీవెనా                  
జీవితాన వరమే బంగారు కుటుంబం
మరువరాని మధురమైన అనురాగం కదంబం              
జీవితాన వరమే బంగారు కుటుంబం

No comments: