Friday, May 03, 2013

అనురాగం--1963




సంగీతం::మాస్టర్ వేణు
రచన::D.C.నారాయణ రెడ్డి
గానం::ఘంటసాల,P. సుశీల
తారాగణం::గుమ్మడి,హరనాధ్,P.భానుమతి,G.వరలక్ష్మి,రేలంగి,రమణారెడ్డి,గిరిజ 

పల్లవి:: 

పదే పదే కన్నులివే బెదరునెందుకు 
ఏదో ఏదో చక్కిలిగింత కలిగినందుకు 
ఆ హా ఆ హా ఓ హో ఓ హో 
ఆ హా ఆహా ఓ హో ఓ హో 
ఒదిగి ఒదిగి లేత వలపు ఒదిగినందుకు 

పదే పదే కన్నులివే బెదరునెందుకు 
ఏదో ఏదో చక్కిలిగింత కలిగినందుకు 

చరణం::1 

నవ్వులలో రివ్వుమనే గువ్వజంటలేమనే..ఏమనెనో 
ఏమనినా ఒంటరితనమింక చాలు చాలనే 
నవ్వులలో రివ్వుమనే గువ్వజంటలేమనే..ఏమనెనో 
ఏమనినా ఒంటరితనమింక చాలు చాలనే 

ఓ ఓ ఓ ఓ  
పదే పదే కన్నులివే బెదరునెందుకు 
ఏదో ఏదో చక్కిలిగింత కలిగినందుకు 

చరణం::2 

చల్లని గాలి నీవైతే..కమ్మని తావీ నేనవుతా 
కొమ్మవు నీవై రమ్మంటే..కోకిల నేనై కూ అంటా 
చేరువనే చేరగనే చెంగులాగుటెందుకు..జాణవులే 
జాణవులే చూపులతో బాణమేసినందుకు  
చేరువనే చేరగనే చెంగులాగుటెందుకు..జాణవులే 
జాణవులే చూపులతో బాణమేసినందుకు  

ఓ ఓ ఓ  
పదే పదే కన్నులివే బెదరునెందుకు 
ఏదో ఏదో చక్కిలిగింత కలిగినందుకు 
ఆ హా ఆ హా ఓ హో ఓ హో 
ఆ హా ఆహా ఓ హో ఓ హో 
ఒదిగి ఒదిగి లేత వలపు ఒదిగినందుకు

No comments: