Saturday, January 30, 2010

ఒకనాటి రాత్రి--1980









సంగీతం::భానుమతి
రచన::?
గానం::బాలు

పల్లవి::

మంచు జల్లుపడి మెరిసే మల్లికవో
మంచు జల్లుపడి మెరిసే మల్లికవో
మంచు చినుకు మదిని కులికే
మంచు చినుకు మదిని కులికే
తరుణ కాంతుల తళతళవో
మంచు జల్లుపడి మెరిసే మల్లికవో

చరణం::1

మన్మధ బాణం నువ్వు, మరుమల్లెకు ప్రాణం నవ్వు
ఆరు ఋతువుల ఆమనివో
మన్మధ బాణం నువ్వు, మరుమల్లెకు ప్రాణం నవ్వు
ఆరు ఋతువుల ఆమనివో
అందీ అందని రతివో అందానికి హారతి నీవో
అందీ అందని రతివో అందానికి హారతి నీవో
ప్రణయవీణా భారతివో
మంచు జల్లుపడి మెరిసే మల్లికవో

చరణం::2

పల్లెపదానికి తెలుగు,తొలి జానపదానికి జిలుగు
ఎంకి పాటకు వెలుతురువో
చూపులు కొలిచిన రూపం
తీగను విడిచిన రాగం
ఎన్ని మమతల మాధురివో
మంచు జల్లుపడి మెరిసే మల్లికవో

చరణం::3

భక్తికి త్యాగయ గీతం, రక్తికి నవరస కావ్యం
భక్తికి త్యాగయ గీతం, రక్తికి నవరస కావ్యం
ఎన్ని పూజలకిది ఫలమో
ముక్తికి కోవెల దీపం, అనురక్తికి జీవనరాగం
ఎన్ని జన్మల సంగమమో

మంచు జల్లుపడి మెరిసే మల్లికవో
మంచు చినుకు మదిని కులికే
మంచు జల్లుపడి మెరిసే మల్లికవో

No comments: