సంగీతం::ఇళయరాజా
గానం::వాణిజయరాం
నిర్మాత & దర్శకత్వం::టి.ఎం.బాలు
నటీ,నటులు::కమల్‌హాసన్,శ్రీదేవి
పల్లవి:
ఎవరికి ఎవరో రంగనాథ తెలియజాలరు కాదా
ఎవరికి ఎవరో రంగనాథ తెలియజాలరు కాదా
ఏ క్షణమెవరు ఏమౌతారో అంతా నీ లీల
ఎవరికి ఎవరో రంగనాథ తెలియజాలరు కాదా
చరణం::1
గూడే వదిలిన..ఒంటరి చిలుక
తోడు నీడ కనలేక..తిరిగే వేళ
మమతే ఎరుగని..ఓ సిరిమల్లిక
గాలికి ఎగిరి గతిలేక..నలిగే వేళ
పువ్వుల..మాలను చేరెను..నేడు చిత్రం చూడు
వింతేనోయి ఇంతేనోయి..కాలం చేసే జాలం
ఎవరికి ఎవరో రంగనాథ..తెలియజాలరు కాదా
చరణం::2
కాలం మనిషికి..ప్రతికూలిస్తే
కర్రే పామై కాటేస్తే..మారును కథలే
దైవంగానీ..అనుకూలిస్తే
చేసిన పుణ్యం ఫలియిస్తే..తీరును వ్యధలే
నిలుచునులేరా..నీలో న్యాయం..నీకు సహాయం
ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా..నీదేలేరా విజయం
ఎవరికి ఎవరో రంగనాథ..తెలియజాలరు కాదా
ఏ క్షణమెవరు ఏమౌతారో..అంతా నీ లీల
ఎవరికి ఎవరో రంగనాథ..తెలియజాలరు కాదా
No comments:
Post a Comment