సంగీతం::చక్రవర్తి
రచన::
గానం::S.P.బాలు , P.సుశీల
పల్లవి::
నీరెండ దీపాలు నీ కళ్ళలో
నా నీడ చూసాను ఎన్నాళ్ళకో
ఈ కొండకోనల్ల వాకిళ్ళలో
నీదాననైనాను కౌగిళ్ళలో
నీరెండ దీపాలు నీ కళ్ళలో
నా నీడ చూసాను ఎన్నాళ్ళకో
చరణం::1
ఈ సంధ్య వెలుగుల్లో నారింజ రంగుల్లో
ఈ సంధ్య వెలుగుల్లో నారింజ రంగుల్లో
నీ అందచందాలు మందారమై
నీ రాగభావాలు శృంగారమై
ఈ కొండగాలుల్లో నా గుండె ఊసుల్లో
నీ మాట అనురాగ సంగీతమై
నీ చూపు ప్రణయాల పేరంటమై
పొద్దెరగని ముద్దులలో ముద్దగ తడిసేవేళ
చరణం::2
నా ఆశలీనాడు ఆకాశమే చేరి
నా ఆశలీనాడు ఆకాశమే చేరి
మెరిసేను తారల్ల మణిహారమై
విరిసేను జాబిల్లి మనతీరమై
అందాల హరివిల్లు పొదరిల్లుగా మారి
వరిచేను విరిపానుపు మనకోసమై
కరగాలి జతగూడి మనమేకమై
ముద్దులలో నెలబాలుడి నిద్దురపోయిన వేళ
నీరెండ దీపాలు నీ కళ్ళలో
నా నీడ చూసాను ఎన్నాళ్ళకో
No comments:
Post a Comment