Saturday, January 30, 2010

ఒకనాటి రాత్రి--1980









సంగీతం::భానుమతి
రచన::?
గానం::P.భానుమతి
నటీ,నటులు::భానుమతి,చక్రపాణి, మధుబాబు, రాజీ, ప్రీతా

పల్లవి::

చిట్టి చిట్టి చేతులతో పాప బంతులాడాలీ
దొరకని దొంగలకు గుణపాఠం నేర్పాలి

చరణం::1

గురిచూడనీ ఎరవేయని పగవారని తెలిసేదాక
గురిచూడనీ ఎరవేయని పగవారని తెలిసేదాక
ఎవరేమిటో ఎపుడేమిటో ఈ ఆట ముగిసేదాకా
బ్రతుకే బంతాట
ఇది ఒక వింతాట

చిట్టి చిట్టి చేతులతో పాప బంతులాడాలీ
దొరకని దొంగలకు గుణపాఠం నేర్పాలి

చరణం::2

పెద్దపులినైనాగాని మాటువేసి పడితే నీ ముందు పిల్లి కాదా
పెద్దపులినైనాగాని మాటువేసి పడితే నీ ముందు పిల్లి కాదా
పిల్లి పిల్లనైనాగాని కట్టి వేసి కొడితే పెద్దపులిగా మారిపోదా
తెలివిగ మెలగాలి మనిషిగ నిలవాలి

చిట్టి చిట్టి చేతులతో పాప బంతులాడాలీ
దొరకని దొంగలకు పాఠం నేర్పాలి
గుణపాఠం నేర్పాలి

No comments: