సంగీతం::భానుమతి,ముత్తు
రచన?
గానం::భానుమతి
నటీ,నటులు::భానుమతి, జయంతి, జగ్గయ్య,
చంద్రమోహన్, వెన్నిరాడై నిర్మల
పల్లవి::
ఇద్దరు తల్లుల వరమిదే..ఇంట వెలిసెనే
ఇద్దరు తల్లుల వరమిదే..ఇంట వెలిసెనే
ఆనంద నిలయమై..నా తనువు పొంగెనే
ఇద్దరు తల్లుల వరమిదే..ఇంట వెలిసెనే
చరణం::1
ఒకరికి కన్నుల్లో మిగిలెను..కన్నీరే
ఒకరికి గుండెల్లో విరిసెను..పన్నీరు
ఒకరికి కన్నుల్లో మిగిలెను..కన్నీరే
ఒకరికి గుండెల్లో విరిసెను..పన్నీరు
కృష్ణుడు నిను పోలిన..బిడ్డయేనమ్మా
ముద్దు మురిపం..యశోదదేనమ్మా
కన్నుల వెన్నెలవే..దేవుని కానుకవే
మదిలో వ్యధలు..మరచానే
ఆనంద నిలయమై..నా తనువు పొంగెనే
ఇద్దరు తల్లుల వరమిదే..ఇంట వెలిసెనే
చరణం::2
మమతల రాగాలే పొంగెను..నాలోన
కుములుచు నీ తల్లి కుంగెను..లోలోన
మమతల రాగాలే పొంగెను..నాలోన
కుములుచు నీ తల్లి కుంగెను..లోలోన
జీవితమన్నది..చదరంగమేనమ్మా
ఎవరికి ఎవరో..చిత్రమేనమ్మా
ఇది విధి కల్పించిన..జీవిత బంధం
అనురాగం అనుబంధం..పూర్వజన్మ పుణ్యమే
ఆనంద నిలయమై..నా తనువు పొంగెనే
ఇద్దరు తల్లుల వరమిదే..ఇంట వెలిసెనే
ఇద్దరు తల్లుల వరమిదే..ఇంట వెలిసెనే
ఆనంద నిలయమై..నా తనువు పొంగెనే
ఇద్దరు తల్లుల వరమిదే..ఇంట వెలిసెనే
No comments:
Post a Comment