Tuesday, October 04, 2011
సీతాకోక చిలుక--1981
సంగీతం::ఇళయరాజా
రచన::వేటూరి
గానం::S.P.బాలు,S.P.శైలజ
సాకీ:
ఓం శతమానం భవతి శతాయు పురుష
శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి తిష్ఠతి
పల్లవి::-
ఆమె::మాటే మంత్రము మనసే బంధము
ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యము
ఇది కల్యాణం కమనీయం జీవితం
అతడు::ఓ..మాటే మంత్రము మనసే బంధము
ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యము
ఇది కల్యాణం కమనీయం జీవితం
ఆమె::ఓ..మాటే మంత్రము
అతడు::మనసే బంధము
చరణం::-
అతడు::నీవే నాలో స్పందించిన
ఈ ప్రియ లయలో శ్రుతి కలిసే ప్రాణమిదే
ఆమె::నేనే నీవుగా పువ్వూ తావిగా
సంయోగాల సంగీతాలు విరిసే వేళలో
అతడు::మాటే మంత్రము మనసే బంధము
ఆమె::ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యము
అతడు::ఇది కల్యాణం కమనీయం జీవితం
ఆమె::ఓ..మాటే మంత్రము
అతడు::మనసే బంధము
చరణం::-
ఆమె::నేనే నీవై ప్రేమించినా
ఈ అనురాగం పలికించే పల్లవినే
అతడు::ఎద నా కోవెల ఎదుటే దేవతా
వలపై వచ్చి వరమే ఇచ్చి కలిసే వేళలో
ఆమె::మాటే మంత్రము మనసే బంధము
అతడు::ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యము
ఆమె::ఇది కల్యాణం కమనీయం జీవితం
ఇద్దరు::లాల లాలలా లాల లాలలా
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment