Tuesday, October 04, 2011

సీతాకోక చిలుక--1981




సంగీతం::ఇళయరాజా
రచన::వేటూరి
గానం::ఇళయరాజా,వాణి జయిరాం

పల్లవి::-
వాణి::స గా మా పా నీ సా
స ని ప మ గ సా
మ మ పా ప ప పా
గ మ ప గ మ గ సా
ని ని సా స స గ గ సా స స
నీ స గా గ మ మ పా
సా స నీ నీ పా ప మా మ
గా గ సా స నీ స

వాణి::స స స ని ని ని ప ప ప మ మ మ గ గ గ స స స ని ని సా
ఇ,రాజ::అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయే
వాణి::స గ పా ప ప పా మ మ పా ప ప పా ప ని ప ని ప స ని ప మా గా
ఇ,రాజ::పగలు రేయి ఒరిసి మెరిసి సంధ్యారాగంలో
ప్రాణం ప్రాణం

వాణి::కలిసి విరిసే జీవన రాగంలో

నన్నననననతనన తనన తనన తానా

అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయే
పగలు రేయి ఒరిసి మెరిసే సంద్యారాగంలో
ప్రాణం ప్రాణం కలిసి విరిసే జీవన రాగంలో
అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయే
తననననన తనననాన
ఇ,రాజ::తకదుం తకదుం తకదుం తకదుం తకతకతకదుం
తకదుం తకదుం తకదుం తకదుం తకతకతకదుం
తకదుం తకదుం తకదుం తకదుం తకదుం తకదుం తకదుం తకదుం

చరణం::-
వాణి::నీ చిరునవ్వుల సిరిమువ్వల సవ్వడి వింటే
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నీ చిరునవ్వుల సిరిమువ్వల సవ్వడి వింటే
ఆ సందడి విని డెందము కిటికీలు తెరచుకుంటే
నీ పిలుపు అనే కులుకులులకే కలికి వెన్నెల చిలికే
నీ జడలో గులాభికని మల్లెలెర్రబడి అలిగే
నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడి బొమ్మ
ఆ కట్టుబడికి తరించేను పట్టు పురుగు జన్మ
నా పుత్తడి బొమ్మ

అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయే

No comments: