సంగీతం::S.హనుమంతరావ్
రచన::దాశరధి
గానం::S.జానకి
ఆమె::నీకేలా యింత నిరాశా..నీకేలా యింత నిరాశా
నీకేలా యింత నిరాశా..నీకేలా యింత నిరాశా
నీ కన్నులలో కన్నీరేలా..అంతా దేవుని లీలా
అంతా దేవుని లీలా
నీకేలా యింత నిరాశా..నీకేలా యింత నిరాశా
ఆశ నిరాశల దాగుడుమూతల..ఆటేలే ఈ లోకం
ఆటేలే ఈ లోకం..ఆటేలే ఈ లోకం
కష్ట సుఖాలా కలయికలోనే..ఉన్నదిలే మాధుర్యం
జీవిత మాధుర్యం..
చీకటి కొంతా..వెలుతురు కొంతా
ఇంతే జీవితమంతా..ఇంతే జీవితమంతా
నీకేలా యింత నిరాశా..నీకేలా యింత నిరాశా
నీ మదిలోని వేదనలన్నీ..
నిలువవులే కలకాలం..నిలువవులే కలకాలం
వాడిన మోడు పూయకమానదు
వచ్చును వసంతకాలం..వచ్చును వసంతకాలం
నీతో కలసీ నీడగ నడిచే
తోడుగ నేనున్నాను..తోడుగ నేనున్నాను
నీకేలా యింత నిరాశా..నీకేలా యింత నిరాశా
No comments:
Post a Comment