Tuesday, October 04, 2011

సీతాకోక చిలుక--1981



సీతాకోక చిలుక 1981
సంగీతం::ఇళయరాజా
రచన::వేటూరి
గానం::బాలు,సుశీల

రాగం..హిందోళ

పల్లవి::-
బాలు::సాగర సంగమమే ప్రణయ సాగర సంగమమే
సాగర సంగమమే ప్రణయ సాగర సంగమమే
కలలే అలలై ఎగసిన కడలికి
కలలే అలలై ఎగసిన కడలికి
కలలో ఇలలో..
కలలో ఇలలో దొరకని కలయిక
సాగర సంగమమే ప్రణయ సాగర సంగమమే

చరణం::-
బాలు::కన్యాకుమారి నీ పదములు నేనే
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కన్యాకుమారి నీ పదములు నేనే
కడలి కెరటమై కడిగిన వేళ
సుమ కుసుమారి నీ చూపులకే
తడబడి వరములు అడిగిన వేళా

సుశీల::అలిగిన నా తొలి అలకలు నీలో
పులకలు రేపి పువ్వులు విసిరిన
పున్నమి రాతిరి నవ్విన వేళ
సాగర
బాలు::సంగమమే
సుశీల::ప్రణయ
బాలు::సాగర సంగమమే

చరణం::-
బాలు::ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
భారత భారతి పద సన్నిదిలో
కులమత సాగర సంగమ శ్రుతిలో
నా రతి నీవని వలపుల హారతి
హృదయము ప్రమిదగా వెలిగిన వేళా

సుశీల::పరువపు ఉరవడి పరువిడి నీ ఒడి
కన్నుల నీరిడి కలిసిన మనసున
సందెలు కుంకుమ చిందిన వేళ

బాలు::సాగర సంగమమే
సుశీల::ప్రణయ సాగర సంగమమే
ఇద్దరు::సాగర సంగమమే.....

No comments: