ఈ పాట ఇక్కడ వినండి
సంగీతం::చక్రవర్తి
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::S.P.బాలు
పల్లవి::
నువ్వే తండ్రివైతే నా తల్లే విశాలక్షీ
నువ్వే నాకు సాక్షీ..
కాశీ విశ్వనాధా తండ్రీ విశ్వనాధా
నువ్వే తండ్రివైతే నా తల్లే విశాలక్షీ
నువ్వే నాకు సాక్షీ..
కాశీ విశ్వనాధా తండ్రీ విశ్వనాధా
చరణం::1
కడుపునవుండి కాలదన్నితే జన్మము ఇచ్చింది
కాళ్ళమీదపడి తల్లీ అంటే కాదు పొమ్మంది
కడుపునవుండి కాలదన్నితే జన్మము ఇచ్చింది
కాళ్ళమీదపడి తల్లీ అంటే కాదు పొమ్మంది
పేగును తెంచిన అదే త్యాగం పేమను తుంచిందా
అది అంతరాత్మనే నులిమేసిందా
ఇక సత్యమన్నదే కరువవుతుందా
ఇక సత్యమన్నదే కరువవుతుందా
కాశీ విశ్వనాధా తండ్రీ విశ్వనాధా
చరణం::2
దేహం రూపం ప్రాణం సర్వం విశాలాక్షి బిక్షా
అన్నెంపున్నెం ఎరుగని నాకు అన్నపూర్ణ బిక్షా
దేహం రూపం ప్రాణం సర్వం విశాలాక్షి బిక్షా
అన్నెంపున్నెం ఎరుగని నాకు అన్నపూర్ణ బిక్షా
ఇద్దరు తల్లుల ముద్దుబిడ్డకు ఇది అగ్నిపరిక్ష
ఒడి చేర్చుకోవా అమ్మా నన్ను
గుడిలోని తండ్రే మనకు తీర్పు
గుడిలోని తండ్రే మనకు తీర్పు
కాశీ విశ్వనాధా తండ్రీ విశ్వనాధా
నువ్వే తండ్రివైతే నా తల్లే విశాలక్షీ
నువ్వే నాకు సాక్షీ..
కాశీ విశ్వనాధా తండ్రీ విశ్వనాధా
శంభో మహాదేవ హరహర శంభో మహాదేవ
శంభో మహాదేవ హరహర శంభో మహాదేవ
కాశీ విశ్వనాధా తండ్రీ విశ్వనాధా
No comments:
Post a Comment