Friday, September 23, 2011

పులు బిడ్డ--1981




సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::S.P.బాలు,P.సుశీల


పల్లవి:: 

అతడు::నడుమా..కన్నెలేడినడుమా
సన్నజాజి తొడిమా..
ఉందో లేదో ఉయ్యాలరో
ఊగుతుంటె జాజిపూల జంపాలరో

ఆమె::నడుమే కన్నెలేడి నడుమే
సన్నజాజి తొడిమే..
ఉండీ లేని ఉయ్యాలరో
ఊగుతుంటె జాజిపూల జంపాలరో

చరణం::1

అతడు::మోములోన చందమామ గోముగున్నాది
మోజుతీరా గున్నమల్లె నవ్వుతున్నాది
యింతకన్న ఏముంది ఎక్కడైనా
ఏ చుక్కకైనా ఎంత చక్కనైనా

ఆమె::కళ్లే తారకలంటావు
కలలే కోరిక లంటావు
అంటుమల్లె తీగల్లె అంటుకుంటే
వొల్లు జల్లుమంటే పైట వెల్లువైతే నడుమా

నడుమా..కన్నెలేడినడుమా
సన్నజాజి తొడిమా..

ఉండీ లేని ఉయ్యాలరో
ఊగుతుంటె జాజిపూల జంపాలరో-2

చరణం::2

ఆమె::అర్థరేయి నిద్దరేమొ నిద్దురోయింది
పొద్దుకూడ ముద్దులేక పొడవనంటుంది
యింతకన్న చెప్పలేని చక్కనోడా
చేత చిక్కినోడా తేనెచుక్కలోడా

అతడు::కౌగిలి యిల్లనుకుంటావు
కవితే కౌగిలింతంటావు
కొండ మల్లె పువ్వులాగా నవ్వుతుంటే
ఎండ ఎన్నెలైతే - వేడి చల్లనైతే

అతడు::నడుమా..కన్నెలేడినడుమా
సన్నజాజి తొడిమా..
ఉందో లేదో ఉయ్యాలరో
ఊగుతుంటె జాజిపూల జంపాలరో

No comments: