సంగీతం::మాస్టర్ వేణు
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::M.S.రాజేశ్వరి
పల్లవి::
అమ్మవంటిది అంత మంచిది అమ్మ ఒక్కటే
అయ్యయ్యైన జేజైనా అమ్మ పిమ్మటే
అమ్మవంటిది అంత మంచిది అమ్మ ఒక్కటే
చరణం::1
బొజ్జలోని పాపాయి పొరలి పొరలి తన్నినా
పొంగిపోవు కడుపు తీపి అమ్మది
కుసిలి కుసిలి పాలకై..కుసిలి కుసిలి పాలకై
గుండెమీద గుద్దినా..మురిసిపోవు వెన్న మనసు అమ్మది
మురిసిపోవు వెన్న మనసు అమ్మది
అమ్మవంటిది అంత మంచిది అమ్మ ఒక్కటే
చరణం::2
గోరుముద్ద తినిపిస్తూ కొండంతగ పెరగాలని
నిండుగ నూరేళ్ళు ఉండాలని కోరుతుంది
నిండుగ నూరేళ్ళు ఉండాలని కోరుతుంది
లాలాబోసి నీళ్లు చుట్టి రామరక్ష అంటుంది
ఆ రామునికి అమ్మకంటే రక్ష ఏమి ఉన్నదీ?
అమ్మవంటిది అంత మంచిది అమ్మ ఒక్కటే
అమ్మవుంటే లేనిదేమి లేనే లేదూ
అమ్మ లేక ఏమున్నా ఉన్నదికాదూ
అమ్మంటే త్యాగమూ..అమ్మే ఒక యోగమూ
అమ్మంటే సత్యమూ..అమ్మే సర్వస్వమూ
అమ్మా..ఆ..అమ్మా..ఆ..అమ్మా...
No comments:
Post a Comment