Friday, September 23, 2011

కలిసిన మనసులు---1968




సంగీతం ::మాష్టర్ వేణు
రచన::దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం::ఘంటసాల,P.సుశీల

Sarada::-- ఒక్కక్షణం ఒక్కక్షణం
నన్ను పలకరించకు
నా వైపిటు చూడకు ఒక్కక్షణం.....ఒక్కక్షణం

నిన్ను తలుచుకోనీ..... నా కళ్ళు మూసుకోనీ
మోయలేని ఈ హాయిని మోయనీ........ఒక్కక్షణం..ఒక్క క్షణం.

Sobhan::-- ఒక్క క్షణం....ఒక్క క్షణం.
ఆరెప్పలు వాల్చకు అటూ ఇటూ కదలకు
ఒక్క క్షణం ఒక్క క్షణం.

ఆ కన్నులలో ఊహల అర్థమేదొ అడగనీ
ఆకొలనులలో నీడల అదే పనిగ చూడనీ
మోయలేని ఈ హాయిని మోయనీ .....ఒక్క క్షణం..ఒక్క క్షణం.

Sarada:--:ఆకులతో గాలి ఊసులాడకూడదూ
ఏటిలోని అలలు పెదవి విప్పగూడదూ..2
మేను మేను తాకగా మౌనముగా గువ్వల వలె
కొమ్మ పైని మాటాడక కునుకు జంట పువ్వుల వలె
మోయలేని ఈ హాయిని మోయనీ... ఒక్క క్షణం.... ఒక్క క్షణం

Sobhan::--మోము పైన ముంగురులు ముసరవచ్చునా
మోవి చుట్టు కోరికలు మూగవచ్చునా..2

వాగులాగ ఈ సమయం సాగిపోవు ననే భయం
నాలో నిండిన నీవే నాకు చాలు నేటికీ...
మోయలేని ఈ హాయిని మోయనీ..



Sobhan::--ఒక్క క్షణం....ఒక్క క్షణం.
ఒక్క క్షణం..ఆ హ..హా.
ఒక్క క్షణం...ఒక్క క్షణం
iddaru::--ఆ ఆ ఆ ఆ ఆ ఆ

No comments: