సంగీతం::ఘంటసాల
రచన::D.C.నారాయణ రెడ్డి
గానం::ఘంటసాల
సినిమా దర్శకత్వం::K.బాబురావు
తారాగణం::కృష్ణ,కాంచన,జగ్గయ్య,విజయలలిత,రాజనాల కాళేశ్వరరావు,బేబి రోజారమణి,చిత్తూరు నాగయ్య,అల్లురామలింగయ్య,రాజబాబు,బాలకృష్ణ,శ్రీరంజని,
భలే మంచిరోజు పసందైన రోజు
వసంతాలు పూచే నేటిరోజు..ఆ ఆ
వసంతాలు పూచే నేటిరోజు
భలే మంచిరోజు పసందైన రోజు
వసంతాలు పూచే నేటిరోజు..ఆ ఆ
వసంతాలు పూచే నేటిరోజు
గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు
గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరినరోజు
గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు
గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరినరోజు
నింగిలోని అందాలన్నీ ముంగిటిలోనే నిలిచినరోజు
భలే మంచిరోజు..పసందైన రోజు
వసంతాలు పూచే నేటిరోజు..ఆ ఆ
వసంతాలు పూచే నేటిరోజు
చందమామ అందినరోజు బృందావని నవ్వినరోజు
తొలివలపులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు
చందమామ అందినరోజు బృందావని నవ్వినరోజు
తొలివలపులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు
కన్నతల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు
భలే మంచిరోజు పసందైన రోజు
వసంతాలు పూచే నేటిరోజు..ఆ ఆ
వసంతాలు పూచే నేటిరోజు
ఆ హహహా ఆ హహహా..
No comments:
Post a Comment