చిమ్మటలోని ఈ ఘంటసాల పాట మనందరి కోసం..వింటూ సాహిత్యం చూద్దామా
సంగీతం::R.గోవర్ధన్
రచన::దాశరథి
గానం::ఘంటసాల
పల్లవి::
నిజమైనా కలలయినా..నిరాశలో ఒకటేలే
పగలైన రేయైన..ఎడారిలో ఒకటేలే
నిజమైనా కలలయినా..నిరాశలో ఒకటేలే..ఒకటేలే
చరణం::1
పదే పదే ఎవరినో..పరాకుగా పిలిచేను
పదే పదే ఎవరినో..పరాకుగా పిలిచేను
నా నీడే నా తోడై..జగమంతా తిరిగేను
నిజమైనా కలలయినా..నిరాశలో ఒకటేలే
పగలైన రేయైన..ఎడారిలో ఒకటేలే..ఒకటేలే
చరణం::2
గులాబినై నీ జడలో..మురిసానే ఆ నాడు
గులాబినై నీ జడలో..మురిసానే ఆ నాడు
బికారినై నీ కోసం..వెతికానే ఈ నాడు
నిజమైనా కలలయినా..నిరాశలో ఒకటేలే
పగలైన రేయైన..ఎడారిలో ఒకటేలే..ఒకటేలే
చరణం::3
చెలి చెలి నా మదిలో..చితులెన్నో రగిలేను
చెలి చెలి నా మదిలో..చితులెన్నో రగిలేను
చెలిలేని నాకేమొ..విషాదమే మిగిలేను
నిజమైనా కలలయినా..నిరాశలో ఒకటేలే
పగలైన రేయైన..ఎడారిలో ఒకటేలే..ఒకటేలే
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ హు .....
No comments:
Post a Comment