Friday, December 09, 2011

మూగనోము--1969

పాడుతా తీయగా చల్లగ అంటూ అన్నిరకాల పాటలూ పాడిన మన ఘంటసాలగారి మరో ఆణిముత్యం వినండి

సంగీతం::R.గోవర్ధన్
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల

పల్లవి::

ఊరు మారినా ఉనికి మారునా
మనిషి దాగినా మమత దాగునా
ఊరు మారినా ఉనికి మారునా
మనిషి దాగినా మమత దాగునా
మరలి రాని పయనంలో మజిలీ లేదు
ఆడదాని కన్నీటికి అంతే లేదు

ఊరు మారినా ఉనికి మారునా
మనిషి దాగినా మమత దాగునా

చరణం::1

అనురాగ దీపం అసమాన త్యాగం
స్త్రీ జాతి కొరకే సృజియించె దైవం
చిరునవ్వులన్ని పెదవారి పరవారి కొసగి
చీకటుల లోనే జీవించు యువతి
తలపులే వీడవు వీడేది మనిషే
వలపులే వాడవు..వాడేది తనువే

ఊరు మారినా ఉనికి మారునా
మనిషి దాగినా మమత దాగునా

చరణం::2

మగవాని కేమో ఒకనాటి సుఖము
కులకాంత కదియే కలకాల ధనము
తనవాడు వీడ అపవాదు తోడ
పదినెలల మోత చురకత్తి కోత
సతులకే ఎందుకూ ఈ ఘోరశిక్ష
సహనమే స్త్రీలకు శ్రీ రామరక్ష

ఊరు మారినా ఉనికి మారునా
మనిషి దాగినా మమత దాగునా
ఊరు మారినా..ఆ..ఉనికి మారునా..ఆ

No comments: