Thursday, December 08, 2011

ఊర్వశి--1974


మొట్టమొదట తెలుగు చిత్రంలో సంజీవ్‌కుమార్ శారదతో నటించిన ఊర్వశి చిత్రంలోని ఈ పాట మీకోసం


సంగీతం::చక్రవర్తి
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు,వాణిజయరాం

తారాగణం::శారద,సంజీవ్ కుమార్ (హింది నటుడు),సత్యనారాయణ,రాజబాబు,రాజశ్రీ,పుష్పలత.
పల్లవి::

సంజీవ్‌కుమార్::
ప్రతి అందం జంటకోసం కలవరించిపోతుందీ

శారద::
జతగూడే బ్రతుకులోనే..జతగూడే బ్రతుకులోనే..
ప్రతి రాగం పలుకుతుందీ..అనురాగం పండుతుందీ..అనురాగం పండుకుతుందీ

సంజీవ్‌కుమార్::
ప్రతి అందం జంటకోసం కలవరించిపోతుందీ

చరణం::1


సంజీవ్‌కుమార్::
కోండ కోరుకొంటుందీ కలికి మబ్బు జంటనూ

శారద::ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

సంజీవ్‌కుమార్::
కడలి కోరుకొంటుందీ కన్నెవాగు జంటనూ

శారద::
కన్నెదాని పరువం కోరుకొంటుంది చిన్నవాణ్ణి జంటనూ చినవాణ్ణి జంటనూ

సంజీవ్‌కుమార్::
ప్రతి అందం జంటకోసం కలవరించిపోతుందీ

చరణం::2


శారద::
పెదవి కోరుకొంటుందీ మరో పెదవి జంటనూ

సంజీవ్‌కుమార్::
అహా..ఓహో..లలలలా..ఆ ఆ

శారద::మేను కోరుకొంటూందీ మరో మేని జంటను

సంజీవ్‌కుమార్::
వలచిన హృదయం కోరుకొంటుందీ తొలివలపు పంటనూ..తొలివలపు పంటనూ

శారద::
ప్రతి అందం జంటకోసం కలవరించిపోతుందీ

చరణం::3


సంజీవ్‌కుమార్::
రాధాకృష్ణుల జంట రసజగతికి తొలివెలుగు

శారద::సీతారాములజంట ఆ వెలుగుకే కనువెలుగు

ఇద్దరు::ఆ వెలుగే మన జీవన పదము సాగిపోదాములే..సాగిపోదాములే

శారద::
ప్రతీందం జంటకోసం కలవరించిపోతుందీ

సంజీవ్‌కుమార్::
జతగూడే బ్రతుకులోనే జతగూడే బ్రతుకులోనే
ప్రతిరాగం పలుకుతుందీ అనురాగం పండుతుందీ
అనురాగం పండుతుందీ

ఇద్దరు::
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

No comments: