Friday, November 25, 2011

ఆదర్శకుటుంబం--1969




చిమ్మటలోని ఈ పాట ఇక్కడ వినండి

సంగీతం::S.రాజేశ్వరరావ్
రచన::కోసరాజు
గానం::ఘంటసాల,P.సుశీల


అతడు::చెయ్యి చెయ్యి కలిపి
నును సిగ్గూ చల్లగ దులుపి
చెయ్యి చెయ్యి కలిపి
నును సిగ్గూ చల్లగ దులుపి
ఈ పాలుబారు బంగారు నేలలో
వరాలపంటలు పండిద్దామే వన్నెల వయ్యారి

కన్నూ కన్నూ కలిసీ..మన కష్టాలన్నీ దులుపీ
కన్నూ కన్నూ కలిసీ..మన కష్టాలన్నీ దులుపీ
నీ ముసు ముసు నవ్వుల ఉషారులోన
మునిగి మునిగి పని చేద్దామోయ్..చక్కని జతగాడ

చరణం::1

అతడు::దేశం సంగతి తలచి భూదేవిని నిత్యం కొలిచీ

కోరస్::దేశం సంగతి తలచి భూదేవిని నిత్యం కొలిచీ

అతడు::మన రెక్కల కష్టం తోటి ప్రజలకు బుక్కెడు అన్నం పెట్టాలే..ఏ..వన్నెల వయ్యరి

ఆమె::పదునుగ వానలు కురిసినవీ..పైరులు రెపరెప పెరిగినవీ

కోరస్::పదునుగ వానలు కురిసినవీ..పైరులు రెపరెప పెరిగినవీ

ఆమె::దరిద్రాన్ని పొలిమేరుదాటగ తరిమి తరిమి కొడదామయ్యో..ఓ..చక్కని జతగాడ

అతడు::చెయ్యి చెయ్యి కలిపి
నును సిగ్గూ చల్లగ దులుపి
ఈ పాలుబారు బంగారు నేలలో
వరాలపంటలు పండిద్దామే వన్నెల వయ్యారి

చరణం::2

అతడు::కలలన్నీ నిజమాయెనులే..కమ్మని రోజులు వచ్చునులే

కోరస్::కలలన్నీ నిజమాయెనులే..కమ్మని రోజులు వచ్చునులే

అతడు::చితికిపోయిన సంసారంలో..జీవరేఖలుదయించునులే..ఏ..
వన్నెల వయ్యారి

ఆమె::కలిసి మెలిసీ తిరగాలీ..బ్రతుకు హాయిగా జరగాలీ

కోరస్::ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

ఆమె::కలిసి మెలిసీ తిరగాలీ..బ్రతుకు హాయిగా జరగాలీ

అతడు:: మనసుల మమతలు పెరగాలీ..
మంచికి దారులు వెయ్యాలీ..ఈ..వన్నెల వయ్యారి


ఆమె::కన్నూ కన్నూ కలిసీ..మన కష్టాలన్నీ దులుపీ
నీ ముసు ముసు నవ్వుల ఉషారులోన
మునిగి మునిగి పని చేద్దామోయ్..చక్కని జతగాడ

అతడు::చెయ్యి చెయ్యి కలిపి
నును సిగ్గూ చల్లగ దులుపి
ఈ పాలుబారు బంగారు నేలలో
వరాలపంటలు పండిద్దామే వన్నెల వయ్యారి

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ....

No comments: