ఈ పాట ఇక్కడ వినండి
సంగీతం::S.రాజేశ్వరరావ్
రచన::ఆత్రేయ
గానం::ఘంటసాల,P.సుశీల
ఆమె:::ఎయ్ ఎయ్‌రా చూస్తావేరా
ఎయ్ ఎయ్‌రా చూస్తావేరా
ఎయ్‌రా నీ కుతి దీరా ఎయ్‌రా నీ తస్సదియ్య
ఎయ్‌రా నీ కుతి దీరా ఎయ్‌రా నీ తస్సదియ్య
చుక్కెయ్ ఎయ్‌రా చూస్తావేరా..చుక్కెయ్ ఎయ్‌రా చూస్తావేరా
ఒకటేసుకున్నావా..ఓ మోస్తరుగుంటాది
రెండేసుకుంటేను..రెపారెపామంటుంది
ఆపైన మూడోది...అడగక్కర్లేదబ్బి
ఎయ్ ఎయ్‌రా చూస్తావేరా..చుక్కెయ్ ఎయ్‌రా చూస్తావేరా
అతడు:::ఏసుకుంటానే..అంతు సూసుకుంటానే
ఏసుకుంటానే..అంతు సూసుకుంటానే
అడుగంటా సూసినాను అలసిపోయే రకంకాను
అడుగంటా సూసినాను అలసిపోయే రకంకాను
ఆపైన నీ యిష్టం ఆలోచించుకో అమ్మీ
ఆమె::ఎయ్ ఎయ్‌రా చూస్తావేరా..చుక్కెయ్ ఎయ్‌రా చూస్తావేరా
ఆమె:::గరంగరం వయసుంది..కరకరలా సొగసుంది
గరంగరం వయసుంది..కరకరలా సొగసుంది
కారంగా కమ్మంగా కన్నెరికం మనసుంది
కారంగా కమ్మంగా కన్నెరికం మనసుంది
నంజుకోను..రంజుంది..నచ్చిందే పుచ్చుకో
ఆమె::ఎయ్ ఎయ్‌రా చూస్తావేరా..చుక్కెయ్ ఎయ్‌రా చూస్తావేరా
అతడు:::తోడులేక ఏసుకునే..వాడుక లేదే..
ఆమె::::ఒహ్హో హ్హో....
అతడు:::తోడులేక ఏసుకునే..వాడుక లేదే..
ఆమె::::కూడావుంటాలే నిన్ను కొసరుకుంటాలే
అతడు:::కిందామీదైనా సరే బందాలు యిడరాదే
ఆమె::::ఎయ్ ఎయ్‌రా చూస్తావేరా
ఎయ్‌రా నీ కుతి దీరా ఎయ్‌రా నీ తస్సదియ్య
ఎయ్‌రా నీ కుతి దీరా ఎయ్‌రా నీ తస్సదియ్య
చుక్కెయ్ ఎయ్‌రా చూస్తావేరా..చుక్కెయ్ ఎయ్‌రా చూస్తావేరా
No comments:
Post a Comment