Saturday, November 26, 2011

పసివాడి పాణం--1987






సంగీతం:;చక్రవర్తి
రచన::
గానం::బాలు,జానకి

చిరు::కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో
ఓ సందమామా..ఓ సందమామా

వి-శాంతి::కన్నె ఈడు మంచులో..కరిగే సూరీడురో
ఓ సందమామా..ఓ సందమామా

చిరు::పొగరాని కుంపట్లు..రగిలించినదే

వి-శాంతి::పొగరెక్కి చలిగాణ్ణి..తగిలేసినాడే

చిరు::చెమ్మాచెక్కా..చేతచిక్క

వి-శాంతి::మంచమల్లే మారిపోయే..మంచుకొండలు

చిరు::మంచిరోజు మార్చమంది..మల్లెదండలు

చిరు::కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో
ఓ సందమామా..ఓ సందమామా

వి-శాంతి::కన్నె ఈడు మంచులో..కరిగే సూరీడురో
ఓ సందమామా..ఓ సందమామా

చరణం::1

చిరు::తేనీటి వాగుల్లో..తెడ్డేసుకో
పూలారబోసేటి..ఒడ్డందుకో

వి-శాంతి::శృంగార వీధుల్లో..చిందేసుకో
మందార బుగ్గల్ని..చిదిమేసుకో

చిరు::సూరీడుతో ఈడు..చలికాచుకో
ముద్దారిపోయాక..పొదచేరుకో

వి-శాంతి::గుండెలోనే పాగా..గుట్టుగావేసాక
గుట్టమైన సోకు..నీదే కదా

చిరు::అరె తస్సా చెక్క..ఆకువక్క
ఇచ్చుకోకముందే..ముట్టె తాంబూలము
పెళ్ళికాకముందే..జరిగె పేరంటము

చిరు::కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో
ఓ సందమామా..ఓ సందమామా

వి-శాంతి::కన్నె ఈడు మంచులో..కరిగే సూరీడురో
ఓ సందమామా..ఓ సందమామా

చరణం::2

వి-శాంతి::సింధూర రాగాలు..చిత్రించుకో
అందాల గంధాలు..హాయందుకో

చిరు::పన్నీటి తానాలు..ఆడేసుకో
పరువాలు నాకంట..ఆరేసుకో

వి-శాంతి::కాశ్మీరు చిలకమ్మ..కసి చూసుకో
చిలకపచ్చ రైక..బిగి చూసుకో

చిరు::గూటిపడవల్లోన..చాటుగా కలిసాక
నీటికైన వేడి..పుట్టాలిలే

వి-శాంతి::పూతమొగ్గ లేత బుగ్గ..
సొట్టపడ్డచోట..పెట్టు నీ ముద్దులూ
హే..సొంతమైన చోటలేవు ఏ హద్దులూ

చిరు::అరే..కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో
ఓ సందమామా..ఓ సందమామా

వి-శాంతి::కన్నె ఈడు మంచులో..కరిగే సూరీడురో
ఓ సందమామా..ఓ సందమామా

చిరు:::పొగరాని కుంపట్లు..రగిలించినదే

వి-శాంతి::పొగరెక్కి చలిగాణ్ణి..తగిలేసినాడే

చిరు::చెమ్మాచెక్కా..హ్హా..చేతచిక్క

వి-శాంతి::మంచమల్లే మారిపోయే..మంచుకొండలు
మంచిరోజు మార్చమంది..మల్లెదండలు

No comments: